అప్పుడు షూటింగ్ నుంచి పారిపోయాను: హీరోయిన్ శ్రియ | Shriya Saran Talks About Rajinikanth's Sivaji In Latest Interview | Sakshi
Sakshi News home page

Shriya Saran: ఇప్పటికీ ఆయన సలహా పాటిస్తున్నా

Published Mon, Mar 18 2024 8:44 AM | Last Updated on Mon, Mar 18 2024 9:03 AM

Shriya Saran Talks About Rajinikanth Sivaji In Latest Interview - Sakshi

శ్రియని సిల్వర్‌ స్క్రీన్‌ బ్యూటీఫుల్ హీరోయిన్ అని పిలవొచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీలో నటించిన ఈమె.. చాలా గుర్తింపు తెచ్చుకుంది. చాలా తక్కువ టైంలోనే రజనీకాంత్‌, చిరంజీవి, నాగార్జున, విజయ్‌ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుని, ఓ పాపకు తల్లి అయినప్పటికీ.. గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు. నటనకు అస్సలు దూరం కాలేదు. శ్రియ నటించిన 'షో టైం' అనే వెబ్‌ సీరీస్‌ స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది.

(ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్)

'నటిగా పరిచయమైన తొలి రోజుల్లో చాలా సమస్యల‍్ని ఎదుర్కొన్నాను. ఓసారి అయితే షూటింగ్‌ నుంచి పారిపోయాను. 'కందసామి' సినిమాలో నటిస్తున్నప్పుడు ఓ సీన్ కోసం చాలా టేక్స్ తీసుకున్నాను. కానీ హీరో విక్రమ్‌ ఎంతో ఓపిగ్గా నాతో పాటు నటించారు. అది ఎప్పటికీ మర్చిపోను. అలానే రజనీకాంత్‌ 'శివాజీ' మూవీలో నటిస్తున్నప్పుడు ఆయన నాకు చాలా మంచి సలహా ఇచ్చారు' 

''మీరు చాలా అందంగా ఉన్నారు, సక్సెస్‌ఫుల్‌ సినిమాలు చేస్తున్నారు. రేపు ఈ పరిస్థితి మారిపోయి ఫ్లాప్స్ చూడొచ్చు. అయినాసరే ప్రేక్షకులతో మర్యాదగా ప్రవర్తించండి, వారితో ప్రేమగా ఉండండి' అని రజనీకాంత్‌ నాతో చెప్పారు. ఇప్పటికీ నేను అదే పాటిస్తున్నాను' అని శ్రియ చెప్పుకొచ్చింది. అయితే షూటింగ్ నుంచి పారిపోయానని శ్రియ చెప్పింది గానీ అది ఏ మూవీ అనేది చెప్పలేదు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement