ఏఐను ఉపయోగించి సినీ హీరోయిన్లను అసభ్యకరంగా చిత్రీకరిస్తున్న తీరుపై స్టార్ హీరోయిన్ శ్రియా శరణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల జాన్వీ కపూర్ నటించిన దేవర సినిమాలోని చుట్టమల్లే పాటను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా ప్రచారం చేసిన సంగతి విధితమే. ఈ దారుణాన్ని జాన్వీ కపూర్‌తో సహా టాలీవుడ్ అగ్రహీరోలు సైతం స్పందించి విరుచుకుపడ్డారు. తాజాగా దీనిపై స్పందించిన శ్రియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: సినిమా ఆఫర్‌కోసం నన్ను పడుకోమన్నాడు: స్టార్ నటి)
‘ఒక్కోసారి వైరల్ అవుతున్న నా ఫోటోలు చూస్తుంటే.. అందులో ఉన్నది నేనా కాదా అనే సందేహం కలుగుతుంది. శారీరక ఆకృతిని పెంచేస్తూ.. వేసుకున్న దుస్తులు మార్చేస్తూ.. చాలా దారుణంగా మార్ఫింగ్ చేస్తుంటారు. ఇది బాధాకరం. ఏఐ అనేది మనుషులకు సహాయం చేయడానికి ఉపయోగపడాలి తప్పా.. ఓ మహిళ గౌరవాన్ని దెబ్బతీయడానికి కాదు’ అని శ్రియా మండిపడ్డారు. కాగా ఆమె ఇటీవల నటించిన చిత్రం దృశ్యం3. ఇటేవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అజయ్ దేవగన్, టబు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రూ.490 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.


