నటి నీతి టేలర్ తాజాగా తనకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఓ దక్షిణాది దర్శకుడు తనను అసభ్యకరమైన రీతిలో సంప్రదించాడని ఆమె పేర్కొంది. ఆ ఘటన తర్వాత తాను సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపింది.
‘ఆ మాటలు విని షాక్‌కు గురయ్యాను’
‘దక్షిణాదిలో తాను కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించాను. మొదటి సినిమాకు దర్శకత్వం వహించిన వ్యక్తే రెండో సినిమాకూ నన్ను సంప్రదాంచారు. మొదటి సినిమా పూర్తయిన తర్వాత ఆ దర్శకుడు ఫోన్ చేసి.. సినిమాలో నటించాలంటే నాతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని.. ‘నాతో పడుకోవాలి’ అన్నట్లుగా అన్నాడు. ఆ మాటలు విని షాక్‌కు గురయ్యాను. ఆ పరిస్థితుల్లో ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు.
ఆ దర్శకుడిని వెంటనే బ్లాక్ చేశానని తెలిపింది. అనంతరం తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాను’ అని వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపింది. కాగా నీతి టేలర్ తెలుగులో ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాలో నటించిది. తాజాగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో మరోసారి చర్చకు దారితీశాయి.
(ఇదీ చదవండి: రజినీ, కమల్‌తో సినిమాలు.. ఆపై వ్యభిచారం..చివరికి ఎయిడ్స్‌తో..!)
You have to SLEEP with me THIS time 🥴 Sensational casting couch reveal on Telugu Movie Director by Actress #NitiTaylor. https://t.co/cTyuWs7wnR
— Indian Clicks (@IndianClicks) October 13, 2026


