సినిమా ఆఫర్‌కోసం నన్ను పడుకోమన్నాడు: స్టార్ నటి
నటి నీతి టేలర్ తాజాగా తనకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఓ దక్షిణాది దర్శకుడు తనను అసభ్యకరమైన రీతిలో సంప్రదించాడని ఆమె పేర్కొంది. ఆ ఘటన తర్వాత తాను సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపింది.‘ఆ మాటలు విని షాక్‌కు గురయ్యాను’‘దక్షిణాదిలో తాను కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించాను. మొదటి సినిమాకు దర్శకత్వం వహించిన వ్యక్తే రెండో సినిమాకూ నన్ను సంప్రదాంచారు. మొదటి సినిమా పూర్తయిన తర్వాత ఆ దర్శకుడు ఫోన్ చేసి.. సినిమాలో నటించాలంటే నాతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని.. ‘నాతో పడుకోవాలి’ అన్నట్లుగా అన్నాడు. ఆ మాటలు విని షాక్‌కు గురయ్యాను. ఆ పరిస్థితుల్లో ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు. ఆ దర్శకుడిని వెంటనే బ్లాక్ చేశానని తెలిపింది. అనంతరం తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాను’ అని వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపింది. కాగా నీతి టేలర్ తెలుగులో ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాలో నటించిది. తాజాగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో మరోసారి చర్చకు దారితీశాయి. (ఇదీ చదవండి: రజినీ, కమల్‌తో సినిమాలు.. ఆపై వ్యభిచారం..చివరికి ఎయిడ్స్‌తో..!) You have to SLEEP with me THIS time 🥴 Sensational casting couch reveal on Telugu Movie Director by Actress #NitiTaylor. https://t.co/cTyuWs7wnR— Indian Clicks (@IndianClicks) October 13, 2026