శ్రేయా సీమంతం | Shreya Ghoshal confirms pregnancy | Sakshi
Sakshi News home page

శ్రేయా సీమంతం

Mar 5 2021 4:31 AM | Updated on Mar 5 2021 4:31 AM

Shreya Ghoshal confirms pregnancy - Sakshi

శ్రేయా ఘోషల్‌ మంచి గాయని. హిందీ చిత్రాలతో పాటు దక్షిణాదిన పలు పాటలు పాడారు. ఆమె పాడిన పాటల్లో ‘శ్రీరామరాజ్యం’లోని ‘సీతా సీమంతం..’ ఒకటి. సినిమాలో నయనతార సీమంతం వేడుకప్పుడు వచ్చే పాట ఇది. ఇప్పుడు ‘శ్రేయా సీమంతం’ జరిగే వేళ వచ్చింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘బేబీ.. శ్రేయాదిత్య (శ్రేయా, ఆమె భర్త తమ పేర్లు కలిపి బిడ్డకు పెట్టాలనుకున్నారని ఊహించవచ్చు) ఈజ్‌ ఆన్‌ ఇట్స్‌ వే. నాకు, శిలాదిత్య (శ్రేయా భర్త పేరు)కు చాలా థ్రిల్‌గా ఉంది. మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్న సందర్భంగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను’’ అంటూ ఓ ఫొటోను షేర్‌ చేశారు శ్రేయా ఘోషల్‌.

Advertisement
 
Advertisement
Advertisement