ఇప్పుడు ఫైట్‌... నెక్ట్స్‌ పాట | Shooting Update of Ram Charan Peddi | Sakshi
Sakshi News home page

ఇప్పుడు ఫైట్‌... నెక్ట్స్‌ పాట

Mar 22 2026 5:19 AM | Updated on Mar 22 2026 5:19 AM

Shooting Update of Ram Charan Peddi

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ రూరల్‌ యాక్షన్‌ మూవీ ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్‌ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ సెట్‌లో జరుగుతోందని సమాచారం. రామ్‌చరణ్‌ పాల్గొంటుండగా క్లైమాక్స్‌ సీక్వెన్స్ ‌లోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.

ఈ చిత్రీకరణలో భాగంగా ఓ ఫైట్‌ కూడా ఉందని భోగట్టా. ఈ క్లైమాక్స్‌ చిత్రీకరణ పూర్తయితే ఈ సినిమా టాకీ పార్ట్‌ దాదాపు పూర్తవుతుందట. ఏప్రిల్‌ మొదటి వారంలో పాటల చిత్రీకరణను ప్లాన్‌ చేశారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 30న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement