స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో జతకట్టిన టాలీవుడ్ హీరో కూతురు! | Shivani Rajashekar acts as Heroime with famous Music Director Movie | Sakshi
Sakshi News home page

Shivani Rajashekar: సంగీత దర్శకుడి సరసన శివాని రాజశేఖర్!

Mar 1 2024 3:13 PM | Updated on Mar 1 2024 3:46 PM

 Shivani Rajashekar acts as Heroime with famous Music Director Movie - Sakshi

తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్‌ ఏర్పరచుకున్న దర్శకుడు పా.రంజిత్‌. ఆయన చిత్రాల్లో సామాజిక దృక్ప థం స్పష్టంగా కనిపిస్తుంది. సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూనే కమర్షియల్‌ అంశాలు యాడ్ చేస్తూ చిత్రాలు రూపొందించడంలో ఆయనను మించినవారు ఉండరు. ఒకవైపు దర్శకుడిగా రాణిస్తూనే నీలం ప్రొడక్షన్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి.. తన శిష్యులకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పిస్తూ వైవిధ్యమైన కథాచిత్రాలను నిర్మిస్తున్నా రు. ఇంతకుముందు దర్శకుడు మారి సెల్వరాజ్‌ వంటి సక్సెస్‌ పుల్‌ దర్శకులను పరిచయం చేశారు.

తాజాగా తన మరో శిష్యుడు అకిరన్‌ మోసెస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురువారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో అతనికి జంటగా టాలీవుడ్ హీరోయిన్ శివానీ రాజశేఖర్‌ నటిస్తున్నారు. శ్రీనాథ్‌ బాజీ, లింగేష్‌, విశ్వంత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ముఖ్యంగా దర్శకుడు పా.రంజిత్‌ నిర్మిస్తున్నారంటే ఆ చిత్రానికి కచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఆయన రూపొందిస్తున్న చిత్రంలో జీవీ ప్రకాష్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించడం మరో విశేషం. వీరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి కథ, తదితర వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా పా.రంజిత్‌ దర్శకత్వంలో విక్రమ్‌ కథానాయకుడిగా నటించిన తంగలాన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement