క్లైమాక్స్‌ బాగుంటే హిట్టే – శివ నిర్వాణ | Sakshi
Sakshi News home page

క్లైమాక్స్‌ బాగుంటే హిట్టే – శివ నిర్వాణ

Published Sat, Sep 2 2023 1:10 AM

Shiva Nirvana: There is no movie in history where the climax is good or bad - Sakshi

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం  ‘ఖుషి’. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం యూనిట్‌ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘శాస్త్రాలు, సిద్ధాంతాలు వేరు కావొచ్చు. కానీ ఎవరు ఏది నమ్మినా నమ్మకున్నా మనం మనల్ని ప్రేమించే మనుషులతో కలిసి ఉండాలని ‘ఖుషి’లో చెప్పం. క్లైమాక్స్‌ బాగుందని ప్రశంసలు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది.

క్లైమాక్స్‌ బాగుంటే సినిమా హిట్టే.. ఫెయిల్‌ అయిన చరిత్ర లేదు’’ అన్నారు. ‘‘షో బై షో కలెక్షన్స్‌ పెరుగుతున్నాయని రిపోర్ట్స్‌ వస్తున్నాయి. ‘ఖుషి’ మంచి మూవీ కాబట్టి అవార్డులూ రావొచ్చు’’ అన్నారు నవీన్‌. ‘‘కథని నమ్మి ‘ఖుషి’ని నిర్మించాం. మా నమ్మకానికి తగ్గట్టు ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయి’’ అన్నారు వై. రవిశంకర్‌. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్, సినిమాటోగ్రాఫర్‌ మురళి, మైత్రీ డిస్ట్రిబ్యూటర్‌ శశి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement