గాఢమైన ప్రేమకథ | Sakshi
Sakshi News home page

గాఢమైన ప్రేమకథ

Published Tue, May 16 2023 6:08 AM

Shiva Kandukuri starrer Manu Charitra release date Fix - Sakshi

శివ కందుకూరి హీరోగా నటించిన తాజా ఇంటెన్స్‌ లవ్‌ స్టోరీ (గాఢమైన ప్రేమకథ) ‘మను చరిత్ర’. ఇందులో మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్‌ హీరోయిన్లుగా నటించారు. భరత్‌ పెదగానిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రొద్దుటూరు టాకీస్‌ పతాకంపై ఎన్‌. శ్రీనివాస రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమాను జూన్‌ 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. శ్రీ విజయ ఫిల్మ్స్‌ ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌ థియేట్రికల్‌ హక్కులను సొంతం చేసుకుంది. ‘‘వరంగల్‌ నేపథ్యంలో సాగే ఇంటెన్స్‌ లవ్‌ స్టోరీ ఇది. ఇందులో ఇంటెన్స్‌ ఉన్న క్యారెక్టర్‌ను శివ చేశారు’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాహుల్‌ శ్రీవాత్సవ్‌.

Advertisement
 
Advertisement