Shiva Balaji wife Madhumitha shares emotional note on her wedding anniversary - Sakshi
Sakshi News home page

Madhumitha: నా జీవితాన్ని అద్భుతంగా మలిచారు.. మధుమిత పోస్ట్ వైరల్

Mar 1 2023 2:49 PM | Updated on Mar 1 2023 3:19 PM

Shiva Balaji Wife Madhumitha Shares Emotional Note On Her Marriage Anniversery - Sakshi

టాలీవుడ్‌ బ్యూటీఫుల్ కపుల్స్ జంటల్లో  నటుడు శివ బాలాజీ, మధుమిత ముందువరుసలో ఉంటారు. హీరో, హీరోయిన్లుగా నటించిన వీరిద్దరు ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2004లో వచ్చిన తమిళ చిత్రం ‘ఇంగ్లీస్‌ కారన్‌’ షూటింగ్‌లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి కొంతకాలం పాటు డేటింగ్‌ చేశారు. అనంతరం పెద్ద అంగీకారంతో 2009 మార్చి 1న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక వివాహం అనంతరం నటకు గుడ్‌బై చెప్పేసింది మధుమిత. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. ఇవాళ వారి వివాహా వార్షికోత్సవం సందర్భంగా మధుమిత తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది.

మధుమిత తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా జననం నేను ఎంచుకోలేనిది. ఆలాగే నా మరణం కూడా నేను ఎంచుకోలేనిదే. ఎనలేని ప్రేమతో నేను ఎంచుకున్న మీతో.. నా జీవితాన్ని అమితమైన ప్రేమతో అత్యద్భుతంగా మలిచారు. ఈ అనంత విశ్వం నాకు ఇచ్చిన అతిగొప్ప వరం మీరు. మీరు నా శివ. నేను మీ మధు. సదా ప్రేమలో పద్నాలుగేళ్ల శివ-మధు పెళ్ళిరోజు శుభాకాంక్షలు.' అంటూ లవ్ ఎమోజీలు జత చేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.  

శివ బాలాజీ తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. 2003లో విడుదలైన ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ అనే సినిమా ద్వారా  ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్న శివ బాలాజీ సినీ రంగంపై ఆసక్తితో ప్రవేశించారు. 

Advertisement
 
Advertisement
Advertisement