Shilpa Shetty is The First Female Cop in Rohit Shetty's Cop Universe - Sakshi
Sakshi News home page

Shilpa Shetty : డిజిటల్‌ ఎంట్రీకి రెడీ అయిన శిల్పాశెట్టి

Apr 23 2022 5:58 PM | Updated on Apr 23 2022 7:17 PM

Shilpa Shetty To Make Her Ott With Rohit Shetty - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ  శిల్పాశెట్టి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై సందడి చేస్తోంది. ఇప్పుడు డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌తో కలసి ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.  సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌ ద్వారా శిల్పా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

దీనికి సంబంధించి అఫీషియల్‌ పోస్టర్‌ని శిల్పా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌  చేసింది. పోలీస్‌ డ్రెస్‌లో గన్‌ పట్టుకొని ఉన్న శిల్పాశెట్టి పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ఢిల్లీ పోలీస్ డిపార్ట్ మెంట్లో స్పెషల్ సెల్ ఆఫీసర్‌గా సిద్ధార్థ్ మల్హోత్ర కనిపించనుండగా, అదే టీమ్‌లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌గా శిల్పా శెట్టి నటిస్తోంది. కాగా ఈ వెబ్‌సిరీస్‌ 8భాగాలుగా తెరకెక్కనుంది.

Advertisement
 
Advertisement
Advertisement