
ఓటీటీలు వచ్చాక సినీ వినోదం ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. థియేటర్లలో కేవలం సినిమాలే కాదు.. ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్‌లకు ప్రత్యేకమై క్రేజ్ ఉంది. అలాంటి వాటిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సరికొత్త సిరీస్ పంచాయత్. ఇప్పటికే విడుదలైన మూడు సీజన్స్‌కు సినీ ప్రియుల నుంచి ఆదరణ దక్కింది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో రెండో సీజన్.. 2024లో మూడో భాగం ప్రేక్షకులను అలరించాయి. ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆదరణ దక్కడంతో మేకర్స్ మరో సీజన్‌కు రెడీ అయిపోయారు. ఇప్పటికే స్ట్రీమింగ్ తేదీ ప్రకటించిన మేకర్స్.. ఇంకాస్తా తొందరగానే స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు.
విలేజ్ నేపథ్యంలో సాగే సరికొత్త కామెడీ డ్రామా సిరీస్‌గా వస్తోన్న నాలుగో సీజన్ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పంచాయత్ సీజన్- 4 జూన్ 24 నుంచే స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. మొదటి ప్రకటించిన తేదీ కంటే వారం రోజులు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. మొదట జూలై 2న స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తాజాగా తేదీ మారడంతో ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ఈనెలలోనే సినీ ప్రియులకు అందుబాటులోకి రానుంది.
కాగా.. ఈ సిరీస్‌లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝా కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ-డ్రామా సిరీస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఫూలేరా గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కథగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయవర్గీయ దర్శకత్వం వహించారు.
shuru ho chuka hai election🗳 Manju Devi ya Kranti Devi, kiski hogi selection 👀
#PanchayatOnPrime, New Season, June 24@TheViralFever @StephenPoppins #ChandanKumar @Akshatspyro @uncle_sherry @vijaykoshy@Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @malikfeb @chandanroy77… pic.twitter.com/dflHA71wbe— prime video IN (@PrimeVideoIN) June 11, 2025