Shekar: ‘శేఖర్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌.. రాజశేఖర్‌ లుక్‌ అదిరిందిగా!

Shekar Movie Glimpse Out - Sakshi

రాజశేఖర్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘శేఖర్‌’. ఆయన సతీమణి జీవిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్‌ ప్లే సమకూర్చారు. బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ని గురువారం విడుదల చేశారు. ‘అరకు బోసుగూడెం తోట బంగ్లాలో నూతన దంపతులు దారుణ హత్యకు గురయ్యారు’ అంటూ ఓ మహిళ వాయిస్‌ ఓవర్‌తో ఫస్ట్‌ గ్లింప్స్‌ మొదలైంది.

‘వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా?’ అంటూ రాజశేఖర్‌ చేసిన శేఖర్‌ పాత్ర పరిచయానికి సంబంధించిన సంభాషణలు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తాయి. జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘రాజశేఖర్‌ నటించిన 91వ చిత్రమిది. ఫస్ట్‌ గ్లింప్స్‌కు మంచి స్పందన వస్తోంది. 2022 జనవరిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్‌ నరగని, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top