Shakuntalam Movie: Gunasekhar Interesting Comments On Mohan Babu, Deets Inside - Sakshi
Sakshi News home page

‘కోపిష్టి అని నా దగ్గరకు వచ్చావా?’ అని మోహన్‌ బాబు అడిగారు: గుణశేఖర్‌

Apr 1 2023 4:34 PM | Updated on Apr 1 2023 5:36 PM

Shakuntalam: Gunasekhar Interesting Comments On Mohan Babu - Sakshi

స్టార్‌ డైరెక్టర్‌ గుణ శేఖర్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. సమంత టైటిల్‌ రోల్‌లో నటించింది. దుర్వాస మహర్షి పాత్రని సినియర్‌ హీరో మోహన్‌బాబు పోషించారు. ఏప్రిల్‌ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గుణ శేఖర్‌.. మోహన్‌బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుర్వాస మహర్షి పాత్రని మోహన్‌బాబు పోషించడం తన ఛాయిస్‌ కాదని, మహాకవి కాళిదాసు ఛాయిస్‌ అన్నారు. ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసేది మోహన్‌బాబు మాత్రమేనని గుణశేఖర్‌ చెప్పుకొచ్చారు. 

‘శాకుంతలం కథ అనుకున్నాక.. దుర్వాస మహర్షి పాత్ర కోసం మోహన్‌బాబు తప్ప ఇంకెవరూ గుర్తుకురాలేదు. కానీ గతంలో ‘రుద్రమాదేవి’ కోసం ఓ పాత్ర చేయమని అడిగితే ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఈ సారి మాత్రం నో చెప్పలేని పాత్రతో వచ్చానని చెప్పా. ‘దుర్వాస మహర్షి పాత్ర మీరు మాత్రమే చేయాలి. ఒకవేళ మీరు చేయను అంటే ఇంకెవరు ఆ పాత్ర చేస్తే బాగుంటుందే మీరే చెప్పండి’ అని మోహన్‌బాబుని అడిగాను. ఆయన వెంటనే పెద్దగా నవ్వి ‘కోపిష్టి అని నా దగ్గరకు వచ్చావా? అని అడిగారు. దుర్వాసునిలో కోపం ఒక్కటే గుణం కాదు.. ఆయనో గొప్ప మహర్షి అని నేను బదులిచ్చా. దీంతో వెంటనే మోహన్‌ బాబు ఆ పాత్రని పోషించడానికి ఒప్పుకున్నారు’అని గుణ శేఖర్‌ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement