ఆట ముగిసింది

Shahid Kapoor wraps Uttarakhand schedule of Jersey - Sakshi

నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రం హిందీలో రీమేక్‌ అయింది. తెలుగు చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరి ఈ హిందీ రీమేక్‌ను డైరెక్ట్‌ చేశారు. నాని పాత్రను షాహిద్‌ కపూర్‌ పోషించారు. కోవిడ్‌ వల్ల చాలా సినిమాల్లానే ఈ సినిమా చిత్రీకరణ కూడా ఆగిపోయింది. అయితే ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను ఉత్తరాఖండ్‌లో తిరిగి ప్రారంభించి, పూర్తి చేశారు. ఈ సినిమాలో క్రికెట్‌ ప్లేయర్‌గా కనిపించడానికి పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నారు షాహిద్‌. మృణాల్‌ థాకూర్‌ కథానాయికగా నటించారు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top