మొదటిసారి ప్రెగ్నెన్సీ.. స్టార్‌ హీరో భార్యకు అలాంటి అనుభవం! | Shahid Kapoor's Wife Mira Rajput Almost Had A Miscarriage During Her First Pregnancy | Sakshi
Sakshi News home page

Shahid Kapoor: షాహిద్‌ కపూర్‌ భార్యకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ.. పెద్ద ముప్పే తప్పింది!

Published Tue, Jun 25 2024 1:17 PM | Last Updated on Tue, Jun 25 2024 1:47 PM

Shahid Kapoor wife Mira Rajput almost had miscarriage during first pregnancy

బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌లో కబీర్ సింగ్, జెర్సీ, పద్మావత్, బ్లడీ డాడీ లాంటి చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం ఆయన దేవా చిత్రంతో ప్రేక్షకుల ముంందుకు రానున్నారు. అయితే తన సినిమాలతో బిజీగా ఉండగానే.. తన ప్రియురాలు మిరా రాజ్‌పుత్‌ను 2015లో షాహిద్‌ కపూర్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన భార్య మీరా రాజ్‌పుత్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు మొదటిసారి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తీవ్రమైన సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో దాదాపు  గర్భస్రావం అయినంత పనైందని.. ఏ నిమిషంలోనైనా బిడ్డను కోల్పోవచ్చని చెప్పారని వెల్లడించింది. అయితే వైద్యులు తనకు వెంటనే సోనోగ్రఫీ చికిత్స అందించారని ఆమె పేర్కొంది.

దీంతో మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నానని.. లేకపోతే గర్భస్రావం జరిగి ఉండేదని తెలిపింది. ఈ విషయంలో తన భర్త షాహిద్ కపూర్‌ పూర్తిగా సహకరించాడని వివరించింది. తమ ఇంటినే ఆస్పత్రిగా మార్చేశాడని మీరా తన భర్తపై ప్రశంసలు కురిపించింది. కాగా.. షాహిద్ కపూర్‌తో వివాహమైన ఏడాది తర్వాత 2016లో మిషా అనే కూతురు జన్మించింది. ఈ జంట 2018లో తమ రెండో బిడ్డ జైన్‌ను స్వాగతించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement