లవ్‌ హాస్టల్‌

Shah Rukh Khan steps in to back Vikrant Massey-Sanya Malhotra and Bobby Deol - Sakshi

విక్రాంత్‌ మెస్సే, ‘దంగల్‌’ ఫేమ్‌ శాన్యా మల్హోత్రా జంటగా బాబీ డియోల్‌ ముఖ్యపాత్రలో నటించనున్న నూతన చిత్రాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. ‘గుర్గావ్‌’ చిత్రదర్శకుడు శంకర్‌ రమణ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మనీష్‌ ముంద్రాతో కలిసి షారుక్‌ ఖాన్‌ తన నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ పతాకంపై నిర్మించనున్నారు. నార్త్‌ ఇండియాలో జరిగిన  ఘటనల ఆధారంగా ‘లవ్‌హాస్టల్‌’ సినిమాను రూపొందించనున్నారు. వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్‌ ఆరంభం కానుంది. ఈలోపు ఈ సినిమాలో నటించనున్న నటీనటులందరూ వర్క్‌షాప్స్‌లో పాల్గొంటారని చిత్రబృందం తెలిపింది. ఊపిరిబిగపట్టే క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం సాగుతుందని  నిర్మాతలు చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top