షారుక్‌ ఖాన్‌ డంకీ ట్రైలర్‌ వచ్చేసింది.. తక్కువ అంచనా వేయకండి | Shah Rukh Khan's Dunki Trailer Released Now | Sakshi
Sakshi News home page

Dunki Trailer:షారుక్‌ ఖాన్‌ డంకీ ట్రైలర్‌ వచ్చేసింది.. తక్కువ అంచనా వేయకండి

Published Tue, Dec 5 2023 11:40 AM | Last Updated on Tue, Dec 5 2023 11:50 AM

Shah Rukh Khan Dunki Trailer Released Now - Sakshi

బాలీవుడ్‌ కింగ్‌ షారూఖ్ ఖాన్, తాప్సీ పన్ను నటించిన డంకీ మూవీ ట్రైలర్ వచ్చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల నటించడం విశేషం. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.  తాజాగా మంగళవారం (డిసెంబర్ 5) రిలీజైన ఈ ట్రైలర్ ఫన్, ఎమోషన్ కలగలిపి ఎంతో ఆసక్తి రేపేలా ఉంది. ఈ ట్రైలర్‌ SRK వాయిస్‌తో ప్రారంభం అవుతుంది.  ఇందులో స్నేహం, కామెడీ, విషాదం వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఇంగ్లిష్ నేర్చుకొని యూకే వెళ్లి సెటిలవ్వాలనుకునే ఓ గ్రామీణ యువకుడి పాత్రలో షారుక్ ఖాన్ అదరగొట్టేశాడు అనిపిస్తుంది. కానీ అతనికి ఎంత ప్రయత్నించినా ఇంగ్లిష్ రాకపోవడంతో అక్రమంగా చూకేలోకి చొరబడాలని ప్రయత్నించడం ఆపై అక్కడి వారికి  దొరికిపోవడం వంటి అంశాలు ఈ కథలో కీలకంగా ఉండనున్నాయి. షారుక్‌ జర్నీలో స్నేహితులతో అతను పడే  ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నాడో  డంకీ ట్రైలర్‌ ద్వారా అర్థం అవుతుంది.

తాజాగా డంకీ ట్రైలర్‌ను షారుక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఇలా చెప్పాడు. 'ఈ కథను నేను లాల్టూ నుంచి మొదలు పెట్టాను.  నా ఫ్రెండ్స్ తో కలిసి రాజు సర్ విజన్ నుంచి మొదలైన ప్రయాణాన్ని డంకీ ట్రైలర్ చూపిస్తుంది. ఈ ట్రైలర్ స్నేహం, కామెడీ, విషాదంతో పాటు ఇల్లు, కుటుంబ జ్ఞాపకాలను అందరినీ తట్టిలేపేలా ఉంటుంది. నేను ఎంతో కాలంగా ఎదరు చూస్తున్న సమయం వచ్చేసింది. డంకీ డ్రాప్ వచ్చేసింది.' అనే క్యాప్షన్‌తో షారుక్ ఈ ట్రైలర్ రిలీజ్ చేశాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకే లాంటి సినిమాలను తీసిన రాజు హిరానీ డైరెక్షన్‌లో డంకీ చిత్రం రావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement