
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహనికి సీనియర్ నటుడు మోహన్ బాబు నివాళులర్పించారు. కృష్ణ పార్థివదేహన్ని చూసిన ఆయన అక్కడే బోరున విలపించారు. కృష్ణను చూసిన వెంటనే బాధను దిగమింగుకోలేక పోయారు. ఆయనతో ఉన్న క్షణాలను మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు.
(చదవండి: ఆయన లేరన్న వార్త విని నా గుండె పగిలింది.. రామ్ చరణ్ ట్వీట్)
అక్కడే మహేశ్ బాబును హత్తుకుని ఓదార్చారు. వారి కుటుంబసభ్యులను మోహన్ బాబు పరామర్శించారు. ఇలాంటి బాధాకర సమయంలో దేవుడు ఆ కుటుంబానికి ధైర్యాన్నివ్వాలని ఆకాంక్షించారు. కృష్ణ మన మధ్య నుంచి వెళ్లిపోవడం తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు.