Ram Charan Condolences: ఆయన లేరన్న వార్త విని నా గుండె పగిలింది.. రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల మెగాస్టార్ తనయుడు, యంగ్ హీరో రామ్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ ఇక లేరన్న వార్త విని నా గుండె పగిలిందని విచారం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనొక లెజెండ్ అని కొనియాడారు. ఆయన సినీ ప్రస్థానం చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు రామ్ చరణ్. సూపర్ స్టార్ మృతిపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ విషాద సమయంలో మహేశ్ బాబుకు ధైర్యాన్ని ఇవ్వాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు, కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.
Heartbroken to hear that Superstar Krishna Garu is no more.
He was a legend whose journey will be remembered forever .
My heartfelt condolences to my brother @urstrulyMahesh , his family and millions of fans🙏🏼🙏🏼— Ram Charan (@AlwaysRamCharan) November 15, 2022