
మెగాహీరో రామ్ చరణ్.. రీసెంట్‌గా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వెళ్లాడు. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అక్కడి అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు. అయితే చరణ్‌తో సెల్ఫీ దిగిన మెల్‌బోర్న్ మేయర్ తెగ మురిసిపోయాడు. తెగ ఆనందపడిపోతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడిది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి రీమేక్ సినిమా.. ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులో)
'మన నగరాన్ని గొప్పగా మార్చడంలో ఇక్కడే ఉంటున్న భారతీయులు కీలకంగా ఉన్నారు. తాజాగా ఇక్కడ జరిగిన భారత స్వాతంత్ర్య వేడుకలకు నేను వెళ్లాను. రామ్ చరణ్‌తో కలిసి సెల్ఫీ తీసుకున్నాను. నా కోరిక నెరవేరింది' అని చరణ్‌పై తన అభిమానాన్ని మేయర్ నిక్ రీస్ బయటపెట్టారు.
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 15వ ఎడిషన్‌కు రామ్‌చరణ్ భార్యతో కలిసి హాజరయ్యాడు. ఆగస్టు 15న ఆస్ట్రేలియాలో మన జాతీయ జెండా ఎగురవేశాడు. ఈ ప్రాంతం తనకెంతో ఇష్టమని, 'ఆరెంజ్' షూటింగ్ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు. భారతీయ సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉందని అన్నాడు.
(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీకి డబ్బులివ్వబోయిన అభిమాని)
