బాలీవుడ్‌ బ్యూటీకి ఫ్యాన్‌ స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎంత క్యూట్‌గా నవ్విందో.. వీడియో వైరల్‌

Sara Ali Khan Took Samosa Pav From Her Fan In Mumbai - Sakshi

Sara Ali Khan Took Samosa From Her Fan: బాలీవుడ్ బ్యూటీ, స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె  సారా అలీ ఖాన్‌(Sara Ali Khan) తరచుగా తన అభిమానులతో ఇంటరాక్ట్‌ అవుతూ ఉంటుంది. తాజాగా ముంబైలో తన ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్‌ అయిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. అందులో తన అభిమాని నుంచి ఆమెకు ఇష్టమైన స్ట్రీట్‌ ఫుడ్‌ సమోసా పావ్‌ను తీసుకుంటున్నట్టు కనిపించింది. సమోసా తీసుకొని, క్యూట్‌గా నవ్వుతూ ఆ అభిమానికి థ్యాంక్స్ చెప్పిందీ కూలీ నెం 1 హీరోయిన్‌.  వీడియోలో సారా వెంట హీరో విక్కీ కౌషల్‌ కూడా ఉన్నాడు. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ వైరల్‌ భయానీ తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఈ వీడియోను షేర్‌ చేశాడు.

ఇటీవల కేదార్‌నాథ్‌ సందర్శన కోసం వెళ్లిన సారా అలీ ఖాన్‌ ట్రోల్‌కు గురైంది. ఈ నెలలో తన తల్లిదండ్రుల డైవర్స్‌ గురించి కూడా మాట్లాడింది సారా. ఓ ఇంటర్వ్యూలో మీ తల్లిదండ్రులు విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు కష్టంగా ఉందా అని అడిగిన హోస్ట్‌ ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది. ' నా వయసులో ఇతరుల కంటే కొంచెం ఎక్కువ పరిపక్వం చెందే ధోరణి నాకు ఎప్పుడూ ఉంటుంది.

తొమ్మిదేళ్ల వయసులో కూడా అలాగే ఉన్నాను. మా ఇంట్లో కలిసి జీవించే ఇద్దరు వ్యక్తులు సంతోషంగా లేరని అనిపించింది. తర్వాత వారు రెండు వేర‍్వేరు కొత్త ఇళ్లల్లో సంతోషంగా గడపడం చూశాను. పదేళ్లలో ఒక్కసారైన మా అమ్మ నవ్విందని నేను అనుకోను, అలాంటింది అకస్మాత్తుగా సంతోషంగా ఉంది. అలా ఇద్దరు వేర్వేరు ఇళ్లల్లో సంతోషంగా ఉంటారంటే నేను ఎందుకు సంతోషంగా ఉండను'. 

సారా అలీ ఖాన్‌ చివరిసారిగా వరుణ్‌ ధావన్‌ నటించిన కూలీ నెం 1లో నటించింది. ఆనంద్ ఎల్‌ రాయ్‌ చిత్రం 'ఆత‍్రంగి రే'లో అక్షయ్‌ కుమార్‌, ధనుష్‌తో కలిసి యాక్ట్‌ చేయనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top