ఆసక్తి పెంచుతున్న సంతోష్‌ శోభన్‌ కొత్త మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ | Santosh Shoban Like Share And Subscribe Movie First Look Poster Launched | Sakshi
Sakshi News home page

Santosh Shobhan: సంతోష్‌ శోభన్‌- మేర్లపాక గాంధీ మూవీ టైటిల్‌ ఇదే..

Sep 5 2022 4:33 PM | Updated on Sep 5 2022 4:56 PM

Santosh Shoban Like Share And Subscribe Movie First Look Poster Launched - Sakshi

విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తు వస్తున్నాడు యంగ్‌ హీరో సంతోష్ శోభ‌న్. గోల్కొండ హై స్కూల్‌ చిత్రంలో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంతోష్‌ తను నేను చిత్రంలో హీరోగా మారాడు. ‘ఏక్ మినీ క‌థ’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకు సంతోష్‌ శోభన్‌ తాజాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం అప్‌డేట్‌ వదిలారుమ మేకర్స్‌. ఈ సినిమాకు ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్రైబ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. కొత్తగా ఉన్న ఈ టైటిల్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్‌లుక్‌, టైటిల్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

చదవండి: జూ.ఎన్టీఆర్‌-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్‌ స్టార్‌?

కాగా ఈ చిత్రంలో సంతోష్‌ శోభన్‌ సరసన జాతీ రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. ఇక టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో సంతోష్‌ శోభన్‌, ఫరియా, సుదర్శన్‌ ముగ్గురు పైకి చూస్తూ కనిపించారు. ఇక సంతోష్‌కు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందించిన ‘ఏక్‌ మినీ కథ’ చిత్రాన్ని కథ అందించిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అడ్వేంచ‌ర‌స్ ట్రావెల్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందిస్తున్నాడు.  నిహారిక ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement