సినిమానే అనుకుంటే.. అంతకుమించి.. ఆ వెబ్ సిరీస్ రికార్డ్! | Sanjay Leela Bhansali Heeramandi Web Series Budget Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Heeramandi Web Series Budget: బాహుబలి, యానిమల్‌ను మించిన బడ్జెట్‌.. ఇండియాలోనే తొలిసారి!

Published Wed, Feb 7 2024 7:12 PM

Sanjay Leela Bhansali Heeramandi Web Series Budget Goes Viral - Sakshi

ఈ రోజుల్లో సినిమా తీయాలంటే మాటలు కాదు. కోట్లతో కూడుకొన్న వ్యవహారం. ప్రస్తుత రోజుల్లో పాన్‌ ఇండియా సినిమాలను కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కిస్తున్నారు. అలా రోజు రోజుకు సినిమా బడ్జెట్‌ పెరుగుతూనే వస్తోంది. ఇక ఓటీటీ యుగం రావడంతో వెబ్‌ సిరీస్‌లు సైతం పోటీపడుతున్నాయి. సినిమాలే ఎక్కువ బడ్జెట్ అనుకుంటే.. ఇప్పుడు వెబ్‌ సిరీస్‌లు సైతం ఆ జాబితాలో చేరిపోయాయి. తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలంటే మనకు గుర్తుచ్చే పేరు రాజమౌళినే. బాహుబాలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు అత్యధిక బడ్జెట్‌తో చేసిన సినిమాలే. కానీ ఇప్పుడు సినిమా బడ్జెట్‌ను మించిపోయేలా ఓవెబ్ సిరీస్ వస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. 

బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. గతంలో అలియాభట్‌తో తీసిన గంగూభాయి కతియావాడి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ హీరామండి వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ బడ్జెట్‌కు సంబంధించిన నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. యానిమల్, బాహుబలి, డంకీ సినిమాల బడ్జెట్‌ను మించిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియాలోనే  అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న వెబ్‌ సిరీస్‌గా నిలవనుంది. తాజా సమాచారం ప్రకారం హీరామండి వెబ్ సిరీస్‌ను రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 

రుద్రను వెనక్కి నెట్టి..

ఇప్పవరకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ నటించిన వెబ్ సిరీస్‌ రుద్ర:ఎడ్జ్ ఆప్ డార్క్‌నెస్ అత్యంత భారీ బడ్జెట్‌గా రూపొందించిన వెబ్ సిరీస్‌గా నిలిచింది. ఈ సిరీస్‌ను దాదాపు రూ.200 కోట్లతో తెరకెక్కించారు. తాజాగా హీరామండి వెబ్ సిరీస్ బడ్జెట్ మాత్రం రూ.200 కోట్లు దాటిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. ‍అయితే బడ్జెట్‌లో ఎక్కువశాతం రెమ్యునరేషన్లకే వెళ్లినట్లు తెలుస్తోంది. పారితోషికం విషయాకొనిస్తే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీయే రూ.60 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. 

ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా బాలీవుడ్ హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. వీరికి కూడా భారీగానే రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి బాహుబలి మూవీని రూ.180 కోట్లతో తెరకెక్కించగా.. యానిమల్ రూ.100 కోట్లు, డంకీ రూ.120 కోట్లతో తీశారు. ఆ లెక్కన ఈ సూపర్ హిట్ సినిమాల బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువ ఖర్చుతో హీరామండి తీస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌ లుక్ పేరుతో టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాదే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. దేశానికి స్వతంత్రం రాకముందు ప్రస్తుతం పాకిస్థాన్‌లోని లాహోర్‌లో వేశ్యల జీవితాలను ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

Advertisement
 
Advertisement