
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. సంజయ్ దత్‌కు కేవలం బాలీవుడ్‌లో మాత్రమే కాదు.. దక్షిణాదిలోనూ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ది రాజాసాబ్, అఖండ-2 చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు బాలీవుడ్‌లో దురంధర్, కన్నడలో కెడి - ది డెవిల్‌లో కనిపించనున్నారు. ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు సంజయ్ దత్.
అయితే తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు సంజయ్ దత్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఓ అభిమాని తనకు రూ.72 కోట్ల ఆస్తిని రాసిచ్చిందని వెల్లడించారు. ఓ మహిళా అభిమాని తాను చనిపోయేముందు తన ఆస్తినంతా నా పేరుమీద రాసిందని పంచుకున్నారు. అయితే ఆ డబ్బుతో తాను ఏమి చేశాడో కూడా వెల్లడించారు. ఆ ఆస్తి మొత్తాన్ని మహిళ కుటుంబానికి తిరిగి ఇచ్చానని సంజయ్ దత్ తెలిపారు.
కాగా..సంజయ్ దత్ 1981లో రాకీ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత విధాత, నామ్, సాజన్, ఖల్ నాయక్, వాస్తవ్ లాంటి చిత్రాలలో నటించారు. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ సినిమాల్లో అలరిస్తున్నారు.