సంధ్య థియేటర్‌ ఘటన: విచారణకు వర్చువల్‌గా హాజరైన బన్నీ | Sandhya Theatre Stampede Case Update | Sakshi
Sakshi News home page

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసు: కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్

Jul 6 2026 2:04 PM | Updated on Jul 6 2026 2:53 PM

Sandhya Theatre Stampede Case Update

సాక్షి, హైదరాబాద్‌: పుష్ప 2 రిలీజ్‌ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణ సోమవారం  నాంపల్లి కోర్టులో జరిగింది. ఈ విచారణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబై నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన ముంబైలో షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల కోర్టు ఆయనకు వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతి నిచ్చింది. గత విచారణకు కూడా బన్నీ వర్చువల్‌గానే హాజరైన సంగతి తెలిసిందే.

ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులు ఉన్నారు. నిందితులందరూ కోర్టుకు హాజరైతేనే తదుపరి విచారణ కొనసాగుతుందని గతంలో న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నేటి విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) కేసులోని 23 మంది నిందితులకు సుమారు 500 పేజీల ఛార్జ్ షీట్ కాపీలను అందజేశారు.

అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. నిందితులకు ఛార్జ్ షీట్ కాపీలు అందడంతో, వచ్చే విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement