Sandeep Madhav Gandharva Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Gandharva Movie Release: 'గంధర్వ' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. వచ్చేది ఆ రోజే..

Published Sun, Jun 26 2022 4:01 PM

Sandeep Madhav Gandharva Movie Release Date Confirmed - Sakshi

Sandeep Madhav Gandharva Movie Release Date Confirmed: సందీప్ మాధవ్, గాయత్రి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం 'గంధర్వ'. ఈ సినిమాను ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించగా ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపనీస్ సమర్పిస్తోంది. ఇక ఈ సినిమాలో శీతల్, సాయి కుమార్, పోసాని కృష్ణమురళి, బాబు మోహన్ , సురేష్ తదితరులు నటించారు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు, ట్రైలర్ మూవీపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. 

దీంతోపాటు ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా గురించి దర్శకుడు అప్సర్, హీరో సందీప్ మాధవ్ చెప్పిన విశేషాలు టాలీవుడ్‌లో చిత్రంపై మంచి బజ్ ఏర్పడేలా చేశాయి. అద్భుతమైన కొత్త పాయింట్‌తో అందరి దృష్టిని ఆకర్షించడానికి దర్శకుడు అప్సర్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ జూలై 8 న  థియేటర్లలో విడుదల కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాప్ రాక్ షకీల్ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ జవహర్ రెడ్డి అందించగా ఎడిటర్‌గా బసవా పైడి రెడ్డి వ్యవహరించారు.

చదవండి:👇
చై-సామ్‌ బాటలో మరో టాలీవుడ్‌ జంట?
హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు..
'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్‌ హీరోయిన్‌..


Advertisement
 
Advertisement
 
Advertisement