ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత | Sandalwood Director Kiran Govi Passed Away With Heart Attack | Sakshi
Sakshi News home page

సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో డైరెక్టర్ మృతి

Mar 25 2023 9:32 PM | Updated on Mar 25 2023 9:37 PM

Sandalwood Director Kiran Govi Passed Away With Heart Attack - Sakshi

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. డైరెక్టర్ కిరణ్ గోవి(53) గుండెపోటుతో మరణించారు. ఈ రోజు తన ఆఫీసులోనే గుండెపోటుకు గురి కాగా.. ఆయన సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డైరెక్టర్ కన్నుమూశారు. దీంతో శాండల్‌వుడ్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

ఆయన ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. సంచారి, పయన, పారు వైఫ్‌ ఆఫ్ దేవదాస్, యారిగే యారింటు లాంటి కన్నడ చిత్రాలను ఆయన దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆయన తెలుగు చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో తిరుగుబోతు అనే మూవీని తెరకెక్కించారు. కిరణ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement