Sana Khan Slams User Who Trolled Her For Wearing Hijab- Sakshi
Sakshi News home page

ఇంత చదివి పరదా వెనక దాక్కున్నారా?: నటిపై కామెంట్‌

Jun 3 2021 4:21 PM | Updated on Jun 3 2021 4:49 PM

Sana Khan Slams User Who Trolled Her For Wearing Hijab - Sakshi

ఓ నెటిజన్‌.. 'మీరు ఇలా పరదా వెనక దాక్కోవడం వల్ల మీ చదువుకు ప్రయోజనమేంటి?' అని ప్రశ్నించాడు. దీనికి సనా ఘాటుగా రిప్లై ఇచ్చింది..

'గగనం', 'కత్తి', 'మిస్టర్‌ నూకయ్య' చిత్రాలతో టాలీవుడ్‌లో గుర్తింపు సంపాదించుకుంది నటి సనా ఖాన్‌. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించిన ఆమె గతేడాది సినిమాలకు గుడ్‌బై చెప్పి అభిమానులకు షాకిచ్చింది. ఆ తర్వాత నెల రోజులు తిరక్కుండానే గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త అనాజ్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది.

తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో హిజబ్‌ ధరించిన ఫొటో పోస్ట్‌ చేసింది. దీనిపై ఓ నెటిజన్‌.. 'మీరు ఇలా పరదా వెనక దాక్కోవడం వల్ల మీ చదువుకు ప్రయోజనమేంటి?' అని ప్రశ్నించాడు. దీనికి సనా ఘాటుగా రిప్లై ఇచ్చింది. 'పరదా ధరిస్తే ఏంటి భాయ్‌.. నా పని నేను చేసుకుంటున్నా. అద్భుతమైన అత్తామామ, భర్తతో పాటు ఆ అల్లా నాకు రక్షణగా ఉన్నారు. నా చదువు కూడా పూర్తి చేశాను. ఇంతకన్నా ఏం కావాలి? ఇది సంతోషకరం కాదంటావా?' అని తిరిగి ప్రశ్నించింది. మొత్తానికి సనా తన సమాధానంతో అతడికి బాగానే బుద్ధి చెప్పిందంటున్నారు ఆమె అభిమానులు.

చదవండి: ఇండియాలో కన్నా ఇక్కడే దారుణం: కౌశల్‌ భార్య

Advertisement
 
Advertisement
Advertisement