Samantha Shaakuntalam Movie Trailer Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Shaakuntalam Movie:సమంత 'శాకుంతలం'.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

Jan 6 2023 6:52 PM | Updated on Jan 6 2023 7:16 PM

Samantha Shaakuntalam trailer release date On January 9th - Sakshi

గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత నటించిన తాజా చిత్రం 'శాకుంతలం'.  పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్‌ కావాల్సి ఉండగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈనెల 9న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశారు. 

ఇప్పటికే సమంత, దేవ్‌ మోహన్‌ రొమాంటిక్‌ పిక్‌తో ఉన్న స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ఇందులో సమంత శకుంతలగా నటించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నారు. అల్లు అర్హ ఈ సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా డెబ్యూ ఇవ్వనుంది. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ చిత్రాన్ని 3D వెర్షన్‌లో కూడా రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement