సామ్‌ పెంపుడు కుక్కపై పోస్ట్‌.. ఒక్క రోజే వెళ్తాను.. | Samantha Post On Her Pet For Leaving It In Hyderabad | Sakshi
Sakshi News home page

Samantha Latest Post: ఒక్క రోజే వెళ్తాను.. అని బాధపడుతున్న సమంత

Nov 12 2021 1:14 PM | Updated on Nov 12 2021 4:07 PM

Samantha Post On Her Pet For Leaving It In Hyderabad - Sakshi

హీరో నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత క్లోజ్‌ ఫ్రెండ్స్‌తో ప్రయాణాలు చేస్తూ విశ్రాంతిని ఆస్వాదిస్తూ బిజీగా ఉ‍న్నారు. మళ్లీ తాను చేయబోయే ప్రాజెక్టులలో పనిచేయడం ప్రారంభించడానికి ముందే ఈ టూర్స్‌ ప్లాన్‌ చేసుకున్నారు. 

ఇక సమంత సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చెన్నైకి వెళ్లినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి సామ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఫోటోనే షేర్‌ చేసింది. సామ్‌కు తన పెట్‌ డాగ్స్‌ హాష్‌, సాషాలంటే ఎంతో ప్రేమ అన్నది తెలిసిందే. పెట్‌ గార్డియన్‌గా సామ్‌ ఎప్పుడు తన పెట్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు.

తాజాగా 'నేను ఒక్క రోజు మాత్రమే వెళ్ళాను.. ఒక్క రోజే.. పాపం నా మొదటి బిడ్డ' అంటూ ఏడుస్తున్న ఎమోజీస్‌ పెట‍్టింది. ఇందులో సాషా..హాష్‌పై ఎక్కి దాన్ని ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తుంది. 

ప్రస్తుతం  సమంత తన రాబోయే సినిమాల ప్రిపరేషన్‌లో బిజీగా ఉంది. సామ్‌ చేతిలో రెండు ద్విభాషా చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి కొత్త దర్శకుడు శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ సినిమా కాగా మరోకటి మైథాలిజికల్‌ డ్రామా అయిన 'శాకుంతలం' పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. మూవీ మేకర్స్‌ ఈ సినిమా విడుదల తేదిని ఇంకా ప్రకటించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement