Samantha: స్కిన్‌ ట్రీట్‌మెంట్‌ కోసం అమెరికాకు సమంత..?, మేనేజర్‌ ఏం చెప్పారంటే..

Samantha Is Not Suffering From Rare Skin Condition, Her Manager Gives Clarity - Sakshi

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత.. గత కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. కొత్తగా ఫోటో షూట్స్‌ కానీ, యాడ్‌ షూట్స్‌లో కానీ కనిపించడంలేదు. సినిమా ఫంక్షన్స్‌కి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆమె అనారోగ్యానికి గురైయ్యారని ఆ మధ్య సోషల్‌ మీడియా కోడై కూసింది. దీనిపై ఆమె మేనేజర్‌ స్పందిస్తూ సమంత సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేయడంతో ఆ పుకార్లకు చెక్‌ పడింది.

తాజాగా మరోసారి సామ్‌ హెల్త్‌పై అలాంటి వార్తలే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  కొంత కాలంగా సమంత ‘పాలీమర్‌ ఫోర్స్‌ లైట్‌ ఎరప్షన్‌’ అనే స్కిన్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతోందని, దీంతో మరోసారి షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చి చికిత్స కోసం అమెరికాకు వెళ్లడానికి సిద్ధమవుతుందని ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది.

(చదవండి: కూతురి చేతిలో ఓడిపోయిన బన్నీ..వీడియో వైరల్‌)

తాజాగా ఈ విషయంపై ఆమె మేనేజర్‌ స్పందించాడు. సమంత అరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పాడు. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశాడు. అయితే, సమంత అమెరికాకు ఎందుకు వెళ్తున్నారనే విషయంపై మాత్రం ఆయన స్పందించలేదు. ఇక సమంత సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం ఆమె నటించిన యశోద, శాకుంతలంల చిత్రాలు రెండూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విజయ్‌ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘ఖుషీ’ నెక్ట్స్‌ షెడ్యూల్డ్‌ స్టార్ట్‌ కావాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top