Allu Arjun Shares Cute Video Of Her Daughter Allu Arha Goes Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun: కూతురి చేతిలో ఓడిపోయిన బన్నీ.. వీడియో వైరల్‌

Sep 21 2022 11:41 AM | Updated on Sep 21 2022 12:39 PM

Allu Arjun Shares Daughter Allu Arha Cute Video - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాల పట్టి  అల్లు అర్హకి సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇక అల్లు అర్జున్ కూడా ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తుంటారు. ముఖ్యంగా కూతురు అర్హతో కలిసి ఆడుకుంటూ చిన్నపిల్లాడిలా మారిపోతాడు బన్నీ. ఇప్పటికే అర్హకు సంబంధించిన పలు క్యూట్‌ వీడియోలు నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో వీడియోలను షేర్‌ చేశాడు బన్నీ. ఇందులో అర్హ గంగిగోవు పాలు గరిటడైనా చాలు.. అదేంటి అని అడగ్గా.. జున్ను అని బన్నీ సమాధానం ఇస్తాడు. అందుకు అర్హ.. అవును నీకెలా తెలుసు అంటూ క్యూట్‌గా అడిగింది.

ఇక ఈసారి నాలుగు ఎర్ర లారీలు.. నాలుగు తెల్ల లారీలు అనే లైన్‌ను వేగంగా, కరెక్ట్‌గా చెప్పాలంటూ టంగ్ ట్విస్టర్ ఇస్తుంది. అయితే ఈ ఛాలెంజ్‌లో ఫాస్ట్‌గా చెప్పలేక అల్లు అర్జున్‌ ఓడిపోతాడు. ప్రస్తుతం ఈ క్యూట్‌ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బన్నీ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement