వైరల్‌: అద్భుతమైన డ్యాన్స్‌తో అదరగొడుతున్న సమంత | Samantha Dance For Vicky Kaushal Challenge Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

వైరల్‌: సమంత అద్భుత స్టెప్పులు చూశారా

Mar 8 2021 9:34 AM | Updated on Mar 8 2021 10:52 AM

Samantha Dance For Vicky Kaushal Challenge Video Viral On Social Media - Sakshi

బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా సెలబ్రిటీలతో సహా సామాన్యులు కూడా పలు చాలెంజ్‌లను విసరడం, స్వీకరించడం సాధారణ విషయం అయిపోయింది. ఆ చాలెంజ్‌కు సంబంధించిన తమ వీడియోలను సోషల్‌ మీడియాల్లో షేర్‌ చేస్తూ అలరిస్తుంటారు. ఒకరు చేసిన పనులను ఇతరులకు సవాల్‌ విసరడం‌ సోషల్ ‌మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లో బాగా ప్రాచుర్యంలోకెక్కిన ఈ చాలెంజ్‌లు ఇటీవల తగ్గిపోయాయి. అయితే తాజాగా టాలీవుడ్‌ భామ సమంత దీనిని మళ్లీ రీ స్టార్ట్‌ చేసినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ విసిరిన డ్యాన్స్‌ చాలెంజ్‌ను అవలీలగా పూర్తి చేసి సూపర్‌ అనిపించారు.

‘ఎడుఆర్డో లుజ్‌క్వినోస్ డోంట్ ర‌ష్’ అనే పాట‌కు అద్భుత‌మైన స్టెప్పులు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అనుషా స్వామీ అనే మాస్టర్‌తో సమంత చేసిన బెల్లీ మూవ్‌మెంట్స్, స్టన్నింగ్‌ పెర్ఫార్మె‍న్స్ నెటిజ‌న్స్‌ను కట్టిపడేస్తోంది. ఈ కుందనపు బొమ్మ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కాగా తనకు ఈ చాలెంజ్‌ ఇచ్చినందుకు విక్కీకి ధన్యవాదాలు తెలిపారు. ఇక కెరీర్ విష‌యానికి వ‌స్తే స‌మంత న‌టించిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ వేసవిలో విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంత‌లం అనే సినిమా చేస్తున్నారు. ఇందులో శ‌కుంత‌ల‌గా క‌నిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement