సమంత గుడ్‌న్యూస్‌ చెప్పబోతోందా.. ఆ ఫోటోతో జోరుగా ప్రచారం!

Is Samantha Akkineni Pregnant Her Latest Photo Creates Dobuts On Pregnancy - Sakshi

సమంత పేరు ప్రస్తుతం మారుమోగిపోతుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్‌ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది. రాజీ పాత్రలో సమంతను తప్పా ఇంకెవరినీ ఊహించుకోలేని విధంగా తన పర్ఫార్మెన్స్‌తో ఇరగదీసింది. జూన్‌4న ప్రసారం అయిన ఈ వెబ్‌సిరీస్‌తో నటిగా సమంత మరింత పేరు సంపాదించింది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత సినిమాల విషయంలో చాలా సెలక్టివ్‌ పాత్రలు పోషిస్తున్న సామ్‌..నటనకు ప్రాధాన్యం ఉండే సినిమాలకే సైన్‌ చేస్తోంది. ఆమె చివరగా నటించిన జాను చిత్రం నిరాశపరిచినా నటిగా సమంతకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం ఆమె షేర్‌ చేసిన ఓ ఫోటోనే.

లేటెస్ట్‌గా సమంత తన సొంత లేబుల్‌ 'సాకీ' దుస్తులు ధరించి  ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ ఫోటోను షేర్‌ చేసింది. అయితే అందులో డ్రెస్‌ కంటే మామిడికాయను హైలైట్‌ చేయడంతో పలువురు నెటిజన్లు సామ్‌..నువ్వు తల్లి కాబోతున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మునుపటి కంటే సమంత కాస్త ముద్దుగా కనిపిస్తుండటంతో అక్కినేని అభిమానులకు గుడ్‌న్యూస్‌ అంటూ నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. దీంతో సమంత గర్భవతి అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

గతంలోనూ సమంత ప్రెగ్నెన్సీపై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక సందర్భంలో సమంత వాటిని ఖండించింది. అయితే లేటెస్ట్‌ ఫోటో మాత్రం ప్రెగ్నెన్సీ కన్‌ఫార్మ్‌కు ఊతం ఇచ్చేలా ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈసారి సమంత స్పందిస్తుందో లేదో చూడాలి. 2017లో సమంత, నాగచైతన్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 

చదవండి : వెబ్‌ సిరీస్‌: ఫ్యామిలీమ్యాన్​ 2 రివ్యూ
'నాగచైతన్యతో గొడవలు'.. సీక్రెట్స్‌ బయటపెట్టేసిన సమంత!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top