ఓ వింత సమస్య  | Samajavaragamana first glimpse out | Sakshi
Sakshi News home page

ఓ వింత సమస్య 

Mar 1 2023 1:15 AM | Updated on Mar 1 2023 1:15 AM

Samajavaragamana first glimpse out - Sakshi

‘ప్రేమించి పెళ్లి చేసుకునేవాళ్లకి క్యాస్ట్‌ ప్రాబ్లమ్‌ వస్తుంది లేకపో తే క్యాష్‌ ప్రాబ్లమ్‌ వస్తుంది.. ప్రపంచంలో ఎవరికీ రాని వింత ప్రాబ్లమ్‌ నాకు వచ్చిందేంట్రా’ అని హీరో శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌లతో ‘సామజవరగమన’ గ్లింప్స్‌ రిలీజైంది.

శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్‌ జంటగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘సామజవరగమన’. అనిల్‌ సుంకర సగర్వ సమర్పణలో రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు బర్త్‌డే (ఫిబ్రవరి 29) సందర్భంగా గ్లింప్స్‌ని రిలీజ్‌ చేశారు. ఈ వేసవిలో రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాంరెడ్డి.
 

Advertisement
 
Advertisement
Advertisement