Salman Khan Joins Shooting For Chiranjeevi God Father Movie - Sakshi
Sakshi News home page

Salman Khan: సల్మాన్‌ఖాన్‌కి గ్రాండ్‌ వెల్క్‌మ్‌ చెప్పిన చిరంజీవి

Mar 16 2022 10:20 AM | Updated on Mar 16 2022 11:59 AM

Salman Khan Joins Shooting For Chiranjeevi God Father Movie - Sakshi

తెలుగు సినిమాలో మరో సంచలనానికి తెరలేచింది. ఇద్దరు అగ్రనటులు కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు.'గాడ్‌ఫాదర్‌' మూవీ దీనికి వేదిక కానుంది. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి గాడ్‌ఫాదర్‌ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌ హిట్‌ లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నటించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 

'మీ రాక ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. ఉత్సాహాన్ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లింది. మీతో స్క్రీన్‌ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ప్రజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు' అంటూ సల్మాన్‌కి గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పారు చిరు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ సినిమాలో సల్మాన్‌ సరికొత్త గెటప్‌లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement