సల్మాన్‌ మొదటి జీతం: మరీ అంత తక్కువా? | Salman Khan First Salary Will Surprise You | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ మొదటి జీతం ఎంతో తెలుసా?

Dec 27 2020 1:35 PM | Updated on Dec 27 2020 1:38 PM

Salman Khan First Salary Will Surprise You - Sakshi

స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ తన 55వ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. పన్వెల్‌ ఫాం హౌస్‌లో కొద్ది మంది శ్రేయోభిలాషుల మధ్య కేక్‌ కట్‌ చేసి బర్త్‌డే సెలబబ్రేట్‌ చేసుకున్నారు. ఆదాయ పన్ను శాఖకు పెద్ద మొత్తంలో పన్ను కడుతున్న ఆయన మొదటి జీతం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు. మరి సల్లూభాయ్‌ అందుకున్న తొలి జీతం ఎంతో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి..

సల్మాన్‌ 1989లో 'బివీ హోతో ఆసి' చిత్రంతో వెండితెరపై ప్రవేశించారు. కానీ అదే ఏడాది విడుదలైన 'మైనే ప్యార్‌ కియా' చిత్రం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. మంచి హిట్‌ ఖాతాలో పడటంతో సల్మాన్‌ ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోగా ఎదిగారు. అయితే ఆయన సినిమాల్లోకి రావడానికి ముందు బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా పని చేశారు. ముంబైలోని తాజ్‌ హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా పని చేసినందుకుగానూ సల్మాన్‌ 75 రూపాయలు అందుకున్నారు. అదే తన మొదటి జీతమని ఈ హీరో పలు ఇంటర్వ్యూలలో సైతం వెల్లడించారు. (చదవండి: హీరో ఎవరో తెలియదు.. నా కథ అనిపిస్తే చాలు)

అనంతరం తనను హీరోగా నిలబెట్టిన 'మైనే ప్యార్‌ కియా' చిత్రానికి రూ.31 వేలు అందుకున్న సల్మాన్‌ తన తర్వాత సినిమాల పారితోషికాన్ని ఏకంగా 75 వేలకు పెంచారు. ఇప్పుడు ఏకంగా ఒక్క ప్రాజెక్టుకు కోట్లు అందుకుంటున్నారు. అయితే ఇన్నేళ్ల ఆయన ప్రయాణంలో ఇప్పటివరకు ఒక్క ముద్దు సీన్‌లో కూడా నటించలేదట. కాగా సల్మాన్‌ ప్రస్తుతం "అంతిమ్‌: ద ఫైనల్‌ ట్రూత్‌" చిత్రంలో నటిస్తున్నారు. మహేశ్‌ మంజేర్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆర్యన్‌ శర్మ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. (చదవండి: ఆమెతో సల్మాన్‌ పెళ్లి ప్రపోజల్‌ రిజక్ట్‌ అయింది..)

Advertisement
 
Advertisement
Advertisement