breaking news
First salary
-
అమ్మా.. నాకు జీతం వచ్చిందోచ్!
తొలి వేతనం.. జీవిత ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ఆర్థిక స్వాతంత్య్రం, ఒక బాధ్యత, కుటుంబ సమష్టి ప్రయాణానికీ సూచిక. అంతటి ప్రత్యేకత ఉన్న తొలి జీతం అందుకున్న రోజు కోట్లాది మందికి భావోద్వేగ ఘట్టం. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఈ వేడుకను జరుపుకొంటారు. ఇంట్లో వాళ్లకు, బంధువులు, స్నేహితులు, సహచరులకు స్వీట్లు పంచేవారు కొందరైతే.. తొలి సంపాదనతో తమ వాళ్లకు బహుమతులను అందించేవారు మరి కొందరు. తొలి వేతనం రాగానే ‘అమ్మా.. జీతం పడింది’ అంటూ జన్మనిచ్చిన తల్లితో సంతోషం పంచుకునేవారే ఎక్కువని యాడ్ ఏజెన్సీ ‘రీడిఫ్యూజన్ ’, లక్నో యూనివర్సిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘భారత్ ల్యాబ్’ తాజా సర్వేలో వెల్లడించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్చిన్న నగరాల నుంచి..‘నా తొలి వేతనం’ పేరుతో నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన 2,125 మంది యువ ఉద్యోగులు పాలుపంచుకున్నారు. 1997–2012 మధ్య జన్మించిన ఈ జెన్ –జీ తరం వాళ్లు.. మొదటి నెల జీతాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎలా ఆదా చేస్తున్నారు అన్న అంశాలపై లోతుగా అధ్యయనం చేశారు. సర్వేలో పాల్గొన్నవారిలో కొందరు ప్రధానంగా కుటుంబ సభ్యులకు గిఫ్టులు అందించి తమ కృతజ్ఞతను చూపారు. కొంత మొత్తాన్ని ఆదా చేయడం ద్వారా.. పెరుగుతున్న ఆర్థిక దూరదృష్టికి నిదర్శనంగా నిలిచారు మరికొందరు. విరాళాలు ఇచ్చి తమలో స్వార్థం లేదని ఇంకొందరు నిరూపించారు. ప్రతి రూపాయి లెక్కించే కుటుంబాలకు ఇవన్నీ భావోద్వేగాలతో ముడిపడిన అంశాలే. ‘మొదటి జీతం.. ఒక స్వాతంత్య్ర ప్రకటన. ముఖ్యంగా మహిళలకు ఒక నిశ్శబ్ద విప్లవం’ అంటారు భారత్ ల్యాబ్ కో–చైర్మన్, రీడిఫ్యూజన్ చైర్మన్ సందీప్ గోయల్.ముందుగా అమ్మకు..తొలి వేతనం అందుకున్న మరుక్షణమే 44.6% మంది ఆ సంతోషాన్ని తొలుత అమ్మతో పంచుకుంటున్నారు. 28.6% మంది తండ్రికి, 16.1% మంది జీవిత భాగస్వామికి, 10.7% మంది తోబుట్టువులకు సమాచారం ఇస్తున్నారు. తరాలు మారుతున్నా.. సామాజిక పరిస్థితులు మారుతున్నా.. కుటుంబ బంధాలకు ఇచ్చే విలువను ఇది సూచిస్తుందని నివేదిక వివరించింది. ఇంటికి తమవంతు ఆర్థిక సహకారంగా గత తరాలు భావిస్తే.. నేటి జెన్ –జీ తరం మహిళల్లో 88.5% మంది తమ మొదటి జీతాన్ని స్వాతంత్య్రంగా అభివర్ణించారు. ఆర్థిక స్వాతంత్య్రం మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అనడానికి ఈ ప్రకటనే నిదర్శనం. స్వాతంత్య్రంతో పాటు ఇంటికి అందించాల్సిన బాధ్యత అని 41.2% మంది పురుషులు భావించారు.దానంలోనూ, పొదుపులోనూ మహిళలేమొదటి జీతాన్ని పొదుపు, దానం చేయడంలో.. రెండింటిలోనూ పురుషుల కంటే మహిళలే ముందుండటం విశేషం. మొత్తంగా 24.5% మంది తొలి జీతాన్ని జాగ్రత్తగా పొదుపు చేశారు. అత్యవసర నిధిని ఏర్పాటు చేయడం, తదుపరి విద్యకు సిద్ధం కావడం లేదా కష్ట సమయాల్లో కుటుంబాన్ని పోషించడం వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చారు. విడివిడిగా చూసినప్పుడు.. 50% మంది మహిళలు పొదుపు చేస్తే, పురుషుల్లో ఈ సంఖ్య 32.3% మాత్రమే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..20.4% మంది తొలి జీతాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించారు. మతపర సంస్థలు, ఎన్ జీఓలు లేదా నేరుగా అవసరంలో ఉన్నవారికి విరాళంగా ఇచ్చారు. భారత్‌లోని యువ సంపాదకులు సమాజ అభ్యున్నతి, శ్రేయస్సును అర్థం చేసుకుంటారని నిరూపించారు. దానంలో మహిళలు 41.6% కాగా, పురుషుల్లో ఈ సంఖ్య 27.7% ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతుల్లో ఆర్థిక వివేకం, సామాజిక బాధ్యత పెరుగుతోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. తమవారికి కృతజ్ఞతగా..తొలి వేతనం పొందిన సంబరాన్ని 38.8% మంది బహుమతుల ద్వారా పంచుకుంటున్నారు. గుర్తుండిపోయే రోజున తల్లుల కోసం ఆభరణాల నుండి తోబుట్టువులకు గ్యాడ్జెట్స్ వరకు.. తమ ప్రయాణానికి మద్దతుగా నిలిచిన వారికి గిఫ్టులతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కిరాణా సామాగ్రి, ఫ్యాన్లు, యుటిలిటీ బిల్లుల వంటి వాటికి 12.2% మంది ఖర్చు చేశారు. తల్లిదండ్రుల అవసరాలకు 4.1% మంది తమ తొలి జీతాన్ని వెచ్చించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 88.3% మంది తమ మొదటి జీతం అవసర ఖర్చులకు సరిపోతుందని చెబితే.. 11.7% మంది ఇబ్బందులు పడ్డట్టు తెలిపారు.బంగారం కొంటున్నారు..పుత్తడి మన జీవితాల్లో భాగం.. అదొక ఆర్థిక భరోసా. అందుకే, ఆభరణాలకు బదులుగా యువ మహిళా ఉద్యోగులు పసిడి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో మూడింట ఒక వంతు మహిళలు తమ తొలి జీతంతో బంగారం కొన్నారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, భారతదేశంలోని 76% యువత నెలవారీ పొదుపు (సిస్టమాటక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ – సిప్) కంటే సౌకర్యవంత పెట్టుబడి విధానాలను ఇష్టపడుతున్నారని నివేదిక వెల్లడించింది. అదనపు ఆదాయం, పండుగ బోనస్‌లు వచ్చినప్పుడు టూర్స్ లేదా తమ కలల బైక్ కొనుగోలు వంటి వ్యక్తిగత లక్ష్యాలకు ఖర్చు చేస్తున్నారు. సంకెళ్ళు లేకుండా జెన్ –జీ తరం పొదుపు చేయాలనుకుంటున్నారు. -
అమ్మా..నాకు జీతం వచ్చిందోచ్..!
తొలి వేతనం.. జీవిత ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ఆర్థిక స్వాతంత్య్రం, ఒక బాధ్యత, కుటుంబ సమిష్టి ప్రయాణానికీ సూచిక. అంతటి ప్రత్యేకత ఉన్న తొలి జీతం అందుకున్న రోజు కోట్లాది మందికి భావోద్వేగ ఘట్టం. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఈ వేడుకను జరుపుకొంటారు. ఇంట్లో వాళ్లకు, బంధువులు, స్నేహితులు, సహచరులకు స్వీట్లు పంచేవారు కొందరైతే తొలి సంపాదనతో తమ వాళ్లకు బహుమతులను అందించేవారు మరి కొందరు. తొలి వేతనం రాగానే ‘అమ్మా.. జీతం పడింది’ అంటూ జన్మనిచ్చిన తల్లితో సంతోషం పంచుకునేవారే ఎక్కువని యాడ్ ఏజెన్సీ ‘రీడిఫ్యూజన్, లక్నో యూనివర్సిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘భారత్ ల్యాబ్’ తాజా సర్వేలో వెల్లడించింది. చిన్న నగరాల నుంచి..‘నా తొలి వేతనం’ పేరుతో నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన 2,125 మంది యువ ఉద్యోగులు పాలుపంచుకున్నారు. 1997–2012 మధ్య జన్మించిన ఈ జెన్–జీ తరం వాళ్లు.. మొదటి నెల జీతాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎలా ఆదా చేస్తున్నారు అన్న అంశాలను లోతుగా అధ్యయనం చేశారు. సర్వేలో పాల్గొన్నవారిలో కొందరు ప్రధానంగా కుటుంబ సభ్యులకు గిఫ్టులు అందించి తమ కృతజ్ఞతను చూపారు.కొంత మొత్తాన్ని ఆదా చేయడం ద్వారా.. పెరుగుతున్న ఆర్థిక దూరదృష్టికి నిదర్శనంగా నిలిచారు మరికొందరు. విరాళాలు ఇచ్చి తమలో స్వార్థం లేదని ఇంకొందరు నిరూపించారు. ప్రతి రూపాయి లెక్కించే కుటుంబాలకు ఇవన్నీ భావోద్వేగాలతో ముడిపడిన అంశాలే. ‘మొదటి జీతం.. ఒక స్వాతంత్య్ర ప్రకటన. ముఖ్యంగా మహిళలకు ఒక నిశ్శబ్ద విప్లవం’ అంటారు భారత్ ల్యాబ్ కో–చైర్మన్, రీడిఫ్యూజన్ చైర్మన్ సందీప్ గోయల్. ముందుగా అమ్మకు..తొలి వేతనం అందుకున్న మరుక్షణమే 44.6% మంది ఆ సంతోషాన్ని తొలుత అమ్మతో పంచుకుంటున్నారు. 28.6% మంది తండ్రికి, 16.1% మంది జీవిత భాగస్వామికి, 10.7% మంది తోబుట్టువులకు సమాచారం ఇస్తున్నారు. తరాలు మారుతున్నా.. సామాజిక పరిస్థితులు మారుతున్నా.. కుటుంబ బంధాలకు ఇచ్చే విలువను ఇది సూచిస్తుందని నివేదిక వివరించింది. ఇంటికి తమవంతు ఆర్థిక సహకారంగా గత తరాలు భావిస్తే.. నేటి జెన్‌జీ తరం మహిళల్లో 88.5% మంది తమ మొదటి జీతాన్ని స్వాతంత్య్రంగా అభివర్ణించారు. ఆర్థిక స్వాతంత్య్రం మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అనడానికి ఈ ప్రకటనే నిదర్శనం. స్వాతంత్య్రంతో పాటు ఇంటికి అందించాల్సిన బాధ్యత అని 41.2% మంది పురుషులు భావించారు. దానంలోనూ, పొదుపులోనూ మహిళలే మొదటి జీతాన్ని పొదుపు, దానం చేయడంలో.. రెండింటిలోనూ పురుషుల కంటే మహిళలే ముందుండటం విశేషం. మొత్తంగా 24.5% మంది తొలి జీతాన్ని జాగ్రత్తగా పొదుపు చేశారు. అత్యవసర నిధిని ఏర్పాటు చేయడం, తదుపరి విద్యకు సిద్ధం కావడం లేదా కష్ట సమయాల్లో కుటుంబాన్ని పోషించడం వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చారు. విడివిడిగా చూసినప్పుడు.. 50% మంది మహిళలు పొదుపు చేస్తే, పురుషుల్లో ఈ సంఖ్య 32.3% మాత్రమే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..20.4% మంది తొలి జీతాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించారు. మతపర సంస్థలు, ఎన్జీఓలు లేదా నేరుగా అవసరంలో ఉన్నవారికి విరాళంగా ఇచ్చారు. భారత్‌లోని యువ సంపాదకులు సమాజ అభ్యున్నతి, శ్రేయస్సును అర్థం చేసుకుంటారని నిరూపించారు. దానంలో మహిళలు 41.6% కాగా, పురుషుల్లో ఈ సంఖ్య 27.7% ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతుల్లో ఆర్థిక వివేకం, సామాజిక బాధ్యత పెరుగుతోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. తమవారికి కృతజ్ఞతగా..తొలి వేతనం పొందిన సంబరాన్ని 38.8% మంది బహుమతుల ద్వారా పంచుకుంటున్నారు. గుర్తుండిపోయే రోజున తల్లుల కోసం ఆభరణాల నుండి తోబుట్టువులకు గ్యాడ్జెట్స్ వరకు.. తమ ప్రయాణానికి మద్దతుగా నిలిచిన వారికి గిఫ్టులతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కిరాణా సామాగ్రి, ఫ్యాన్లు, యుటిలిటీ బిల్లుల వంటి వాటికి 12.2% మంది ఖర్చు చేశారు. తల్లిదండ్రుల అవసరాలకు 4.1% మంది తమ తొలి జీతాన్ని వెచ్చించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 88.3% మంది తమ మొదటి జీతం అవసర ఖర్చులకు సరిపోతుందని చెబితే.. 11.7% మంది ఇబ్బందులు పడ్డట్టు తెలిపారు.బంగారం కొంటున్నారు..పుత్తడి మన జీవితాల్లో భాగం.. అదొక ఆర్థిక భరోసా. అందుకే, ఆభరణాలకు బదులుగా యువ మహిళా ఉద్యోగులు పసిడి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో మూడింట ఒక వంతు మహిళలు తమ తొలి జీతంతో బంగారం కొన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, భారతదేశంలోని 76% యువత నెలవారీ పొదుపు (సిస్టమాటక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ సిప్) కంటే సౌకర్యవంత పెట్టుబడి విధానాలను ఇష్టపడుతున్నారని నివేదిక వెల్లడించింది. అదనపు ఆదాయం, పండుగ బోనస్‌లు వచ్చినప్పుడు టూర్స్ లేదా తమ కలల బైక్ కొనుగోలు వంటి వ్యక్తిగత లక్ష్యాలకు ఖర్చు చేస్తున్నారు. సంకెళ్ళు లేకుండా జెన్ –జీ తరం పొదుపుచేయాలనుకుంటున్నారు.(చదవండి: అమ్మలకు ఆదాయ పన్ను మినహాయింపు..!) -
తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా?
భారతదేశంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లకు పాపులారీటీ గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన పనేలేదు.మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల కొద్దీ సబ్స్క్రైబర్లతో వేలాదిమంది యూట్యూబర్లు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆదాయ ఆర్జనలోనూ తమ మర్క్‌ను చాటుకుంటున్నారు. అలాంటి వారిలో టాప్‌లో ఎవరున్నారో తెలుసా? ఎంటర్టైన్మెంట్ రంగంలో అత్యధిక నికర విలువతో భారతదేశంలోనే అత్యంత ధనిక యూట్యూబర్‌గా నిలిచాడు. నటుడిగా, గాయకుడిగా, రచయితగా, బిజినెస్ మేన్‌గా భువన్ బామ్ స్ఫూర్తిదాయకమైన విజయగాథను చూద్దాం. బడ్డింగ్ ఆర్టిస్టుగా వినోద పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించిన భువన్ బామ్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంనుంచి వచ్చాడు. తన టాలెంట్‌తో అంచెలంచెలుగా ఎదిగాడు. దేశంలోని టాప్ యూట్యూబర్లలో ఒకరిగా నిలిచాడు. 26 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను తన ఖాతాలో వేసుకున్నాడు. భువన్ బామ్ నికర విలువ దాదాపు 15 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు రూ.122 కోట్లు. ఈ సంపాదనంతా, బ్రాండ్, ఎండార్స్మెంట్ డీల్స్, తన సొంత వెబ్ సిరీస్, సినిమా పాత్రలు , యూట్యూబ్ వీడియోల ద్వారా వచ్చిన ఆదాయం గుజరాత్‌లోని వడోదరకు చెందినవాడు భువన్ బామ్. చిన్నప్పటినుంచి మ్యూజిక్ మీద ఉన్న ప్రేమతో దాన్నే కరియర్‌గా ఎంచుకున్నాడు ఢిల్లీలోని చిన్న కేఫ్‌లు , రెస్టారెంట్లలో పాడటం మొదలు, రియాలిటీ టీవీ షో పాటల పోటీల్లోనూ పాల్గొనేవాడు. ఈ క్రమంలో అతని సంపాదన నెలకు రూ. 5000 మాత్రమే. ఈ చాలీ చాలని జీతమే అతనిలో ఎదైనా సాధించాలంటే పట్టుదల పెరిగింది. దాంతో యూట్యూబ్ వైపు మళ్లాడు. అలా ఒక్కో మెట్టూ ఎదుగుతూ ప్రస్తుతం బిబి కి వైన్స్ అనే కామెడీ ఛానెల్‌తో పాపులర్ అయ్యాడు. కాశ్మీర్ వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన మహిళను అభ్యంతర కరమైన ప్రశ్నలు అడిగిన వార్తా విలేకరిని దూషించిన వీడియోను అప్లోడ్ చేసిన పాపులరయ్యాడు. దీనికి ముందు అనేక మ్యూజిక్ ఆల్బమ్స్‌తో సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. 2018లో తాను రూపొందించిన ప్లస్మైనస్ షార్ట్ ఫిలిం కూడా బాగా పేరు తెచ్చుకుంది. దివ్య దత్తో కలిసి నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ 2019లో ది బెస్ట్ షార్ట్‌ఫిలిం అవార్డు కూడా గెల్చుకుంది. సఫర్, రహగుజార్, అజ్ఞాతవాసి లాంటి ఆల్బమ్స్ అతని ఖాతాలో ఉన్నాయి. అంతేనా యూట్యూబ్‌లో టిటు టాక్స్ అనే కొత్త డిజిటల్ సిరీస్‌లో షారుఖ్ ఖాన్ ఫస్ట్ గెస్ట్‌గా కనిపించాడు. మే 2020లో, బామ్ 'లైఫ్‌లైన్ ఆఫ్ సొసైటీ'లో ఇండియాలో లాక్డౌన్ సమయంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించి చాలామందిని ఆకట్టుకుంటున్నాడు. ఎలక్ట్రీషియన్, హౌస్ హెల్ప్, రైతులు, చిన్నచిన్న వ్యాపారులు తదితరుల కష్టాలను రికార్డు చేసిన ఈ వీడియోలు విశేషంగా నిలిచాయి. జనవరి 2021లో తన ఛానల్ బిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుందని స్వయంగా ప్రకటించాడు. ఇటీవల ధిండోరా అనే వెబ్ సిరీస్‌తోపాటు, భువన్ రొమాంటిక్ కామెడీ అమెజాన్ మినీ టీవీ సిరీస్ రఫ్తా..రఫ్తాతో తానేంటో నిరూపించు కున్నాడు. హిట్ సిరీస్‌లు షోలతో ఇలా ఒకదాని తరువాత సక్సెస్‌తో దూసుకుపోతున్ భువన్ జనవరి 2023లో, తాజా ఖబర్‌తో ఓటీటీ అరంగేట్రం చేసాడు. జూన్ 26న రోడ్డు ప్రమాదంలో మరణించిన సహనటుడు దేవరాజ్ పటేల్‌కు హృదయపూర్వక నివాళులర్పించారు. అయితే 2021లో కోవిడ్ కారణంగా బామ్ తల్లిదండ్రులు చనిపోవడం విషాదాన్ని నింపింది. అయినా మొక్కవోని ధైర్యంతో తన లక్ష్యంపై అడుగులు వేస్తూ తనలాంటివారి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. -
సినిమాల్లోకి రాకముందు పూజా హెగ్డే ఏం చేసేదో తెలుసా?
పూజా హెగ్డే.. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా దూసుకుపోతుంది. ‘అల వైకుంఠపురములో’ ఇచ్చిన సక్సెస్‌తో బుట్టబొమ్మ రేంజ్ మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి పూజాకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దీంతో డిమాండ్‌ను బట్టి పారితోషికాన్ని సైతం పెంచేసింది ఈ బ్యూటీ. మరి తొలినాళ్లలో సినిమాల్లోకి రాకముందు పూజా ఏం చేసేది? ఆమె తొలి సంపాదన ఎంత అన్న వివరాలను తెలుసుకుందాం. -
సల్మాన్ మొదటి జీతం: మరీ అంత తక్కువా?
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన 55వ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. పన్వెల్ ఫాం హౌస్‌లో కొద్ది మంది శ్రేయోభిలాషుల మధ్య కేక్ కట్ చేసి బర్త్‌డే సెలబబ్రేట్ చేసుకున్నారు. ఆదాయ పన్ను శాఖకు పెద్ద మొత్తంలో పన్ను కడుతున్న ఆయన మొదటి జీతం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు. మరి సల్లూభాయ్ అందుకున్న తొలి జీతం ఎంతో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. సల్మాన్ 1989లో 'బివీ హోతో ఆసి' చిత్రంతో వెండితెరపై ప్రవేశించారు. కానీ అదే ఏడాది విడుదలైన 'మైనే ప్యార్ కియా' చిత్రం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. మంచి హిట్ ఖాతాలో పడటంతో సల్మాన్ ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఆయన సినిమాల్లోకి రావడానికి ముందు బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా పని చేశారు. ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా పని చేసినందుకుగానూ సల్మాన్ 75 రూపాయలు అందుకున్నారు. అదే తన మొదటి జీతమని ఈ హీరో పలు ఇంటర్వ్యూలలో సైతం వెల్లడించారు. (చదవండి: హీరో ఎవరో తెలియదు.. నా కథ అనిపిస్తే చాలు) అనంతరం తనను హీరోగా నిలబెట్టిన 'మైనే ప్యార్ కియా' చిత్రానికి రూ.31 వేలు అందుకున్న సల్మాన్ తన తర్వాత సినిమాల పారితోషికాన్ని ఏకంగా 75 వేలకు పెంచారు. ఇప్పుడు ఏకంగా ఒక్క ప్రాజెక్టుకు కోట్లు అందుకుంటున్నారు. అయితే ఇన్నేళ్ల ఆయన ప్రయాణంలో ఇప్పటివరకు ఒక్క ముద్దు సీన్లో కూడా నటించలేదట. కాగా సల్మాన్ ప్రస్తుతం "అంతిమ్: ద ఫైనల్ ట్రూత్" చిత్రంలో నటిస్తున్నారు. మహేశ్ మంజేర్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆర్యన్ శర్మ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. (చదవండి: ఆమెతో సల్మాన్ పెళ్లి ప్రపోజల్ రిజక్ట్ అయింది..) -
మొదటి జీతం
కథ రెండు వేల రూపాయలు... అక్షరాలా రెండు వేల రూపాయలు. నా జీవితంలో మొట్టమొదటి జీతం డబ్బులు. ఈ డబ్బును అందుకున్న రోజు నేను వేసుకున్న చొక్కా ఖరీదు రూ.800. ప్యాంటు ఖరీదు రూ.1350. అంటే ప్రస్తుత సమాజంలో ఈ 2000 రూపాయలతో ఒక జత నాణ్యమైన బట్టలను కూడా కొనుక్కోలేను. అయినా సరే ఎందుకో తెలీని ఆనందం. ఒక చిన్న గర్వం. ఇవి నా డబ్బులు. ‘మై మనీ. మేరా పైసా’. నేను ఎలాగైనా ఖర్చు చేసుకోవచ్చు.అయితే చాలామంది అంటుంటారు, డబ్బుకు మాత్రమే విలువనిచ్చేవాడు పైకి రాలేడు అని. నేనంటాను, కష్టపడి సంపాదించిన డబ్బును వృథాగా ఖర్చుపెట్టేవాడు కూడా పైకి రాలేడు అని. మన భాగ్యనగరంలో బస్సులకు, బస్టాపులకు కొదవ లేకున్నా, అకారణపు బంద్‌ల వల్ల ఆ కొరత కనిపిస్తుంది. అదృష్టం కొద్దీ ఈ రోజు అలాంటిదేమీ లేకపోవడం వల్ల, నేను ఎక్కాల్సిన బస్సు ఎక్కాను. తీస్కోవాల్సిన టికెట్ తీస్కొని, కూర్చోవాలనుకున్న కుర్చీలో కూర్చున్నాను. నేను చేరాల్సిన గమ్యం కోసం బస్సు ముందుకు వెళ్తుంటే, ఆలోచనలతో నా మనస్సు వెనక్కి వెళ్లింది. అది నేను రెండవ తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా. పుస్తకాల సంచీ భుజాలకు తగిలించుకుని బడికి బయల్దేరాను. రెండు నిమిషాలు నడిచాక, ఏదో తళుక్కున మెరిసింది, నా రెండు కాళ్లకు మూడు గజాల దూరంలో. చూస్తే ఒక రూపాయి బిళ్ల. చేతిలోకి తీస్కొని చుట్టూ చూశాను. ఎవరూ లేరు. అక్కడ అప్పుడు ఎవరైనా ఉండి ‘ఈ రూపాయి నాది’ అని అంటే ఇచ్చేవాణ్నేమో. కానీ ఎవరూ లేరు. అడగలేదు. నేనూ ఎవ్వరికీ ఇవ్వలేదు. ఆ రూపాయిని నిక్కర్ జేబులో వేస్కొని బడికి వెళ్లాను. తరగతి గదిలో అయితే కూర్చున్నాను కానీ, నా మనసంతా దొరికిన రూపాయి బిళ్లపైనే ఉంది. ఎలా ఖర్చు పెట్టాలా అని! చిత్తం శివుడిపై భక్తి చెప్పులపై అన్నట్లు నేను క్లాసులో, మనసు రూపాయితో పాటు జేబులో. మొత్తానికి ఎదురుచూసిన సాయంత్రం వచ్చింది. బడిగంట మోగింది. బడి నుండి బయటికి వచ్చేశాను. ఇక ఇంటికి వెళ్లేలోపు ఆ రూపాయిని ఖర్చు చేయడము, ఖరీదు చేసిన ఆ తినుబండారాలను తినడము, తిన్నవాటిని అరిగించుకోవడము, ఇంకాతర్వాత ఆ రూపాయి గురించి మర్చిపోవడం కూడా జరిగింది. మళ్లీ ఇన్నాళ్లకు గుర్తొచ్చింది ఆ రూపాయి. లేదు, నా మొదటి జీతం గుర్తుచేసింది. అవి నేను ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న రోజులు. కళాశాల నుండి ఇంటికి వస్తున్న నాకు, రెండు నిమిషాలలో ఇంటికి చేరతాననగా, దారిలో ఒక కాగితం కనిపించింది. ఏదో అనుమానంతో తీస్కున్న నాకు, అది వెయ్యి రూపాయల నోటుగా వెంటనే నిర్ధారణ అయింది. దానిలో భాగస్వామ్యం పొందడానికి ఎవరైనా నన్ను చూస్తున్నారేమోనని చుట్టూ గమనించాను. అక్కడ ఎవరూ లేరు కానీ ఎక్కడో ఉన్న నా స్నేహితులు గుర్తొచ్చారు. వాళ్లకి ఇవ్వాల్సిన ‘పార్టీ’ వాయిదా వేసి ఉన్నానని గుర్తొచ్చింది. అంతే, మరుసటిరోజుకి నా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలలేదు. నేను అంతలా ఖర్చుపెట్టినా నాకు సంతృప్తి లేదు. ఒక చిన్న ఆనందం కలిగినా అది అప్పటి తాత్కాలిక ఆనందం అని ఇప్పుడు అర్థం అవుతోంది. ఇలా రూపాయి నాణెం నుండి వెయ్యి రూపాయల నోటు వరకు ఎన్నోసార్లు ఎంత ఖర్చుపెట్టినా, వాటిల్లో ఆనందం కలిగింది కానీ సంతృప్తి మిగలలేదు. ఎందుకంటే అవి దొరికినవో నాన్న ఇచ్చినవో కాబట్టి! ఇంజనీరింగ్ అయిపోయాక, ఖాళీగా ఉన్న రోజుల్లో స్నేహితులతో కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లాలని ప్రణాళికను రూపొందించుకొని, ఒక్కొక్కరికీ 4000 రూపాయలు అవుతుందని నిర్ణయించుకున్నాం. నా స్నేహితులంతా డబ్బు ఎలా సర్దాలా అని మథనపడుతున్నారు. కొంతమంది అంత డబ్బు లేదని చేతులెత్తేశారు. డబ్బును సర్దడానికి వాళ్లు పడుతున్న ఆందోళన నాలో కొంచెం కూడా లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. బహుశా మా నాన్నకు నాపై ఉన్న ప్రేమ మీద నాకున్న నమ్మకమేమో! అదే రోజు నేను ఇంటికి వెళ్లే సమయానికి ఇంట్లో నుండి ఏవో మాటలు కొంచెం పెద్దగా వినిపిస్తున్నాయి. ఆ మాటలు గొడవకు తక్కువ, బాతాఖానికి ఎక్కువలా ఉన్నాయి. నేను ఇంట్లోకి ప్రవేశించే సరికి బుర్రమీసాలతో గుర్రుగా ఉన్న ఒక వ్యక్తి చిరాకుగా చూస్తూ వెటకారంగా మా నాన్నతో మాట్లాడుతున్నాడు. నాన్న మాటల్లో మాత్రం అభ్యర్ధించడం కనిపిస్తుంది. మొత్తానికి ఆ సంభాషణ ద్వారా నాన్న అతనికి నాలుగు లక్షలు అప్పు ఉన్నాడని అర్థమైంది. ఛ! నాన్న మాకోసం చేసిన అప్పును మేము చేసిన అప్పుగా కాకుండా, నాన్న చేసిన అప్పుగా చెప్తున్న నా విచక్షణా రాహిత్యానికి సిగ్గు పడుతున్నాను. ఆ పరిస్థితుల్లో కూడా అమ్మకి టూర్ గురించి చెప్పి డబ్బును అడగటం గుర్తు తెచ్చుకుంటుంటే ఇప్పుడు బాధగా, సిగ్గుగా ఉంది. అమ్మ ఆ రోజు నాతో ఏం మాట్లాడలేదు కానీ, మా ఆర్థిక సమస్యలతో సంబంధం లేకుండా, కేవలం నా సంతోషం కోసం తర్వాతి రోజు ఉదయం నా చేతిలో డబ్బును ఉంచింది. ఆ రోజు నాకొకటి అర్థమైంది - సమాజానికి ఒక కుటుంబం ఎంత హుందాగా కనిపించినా, ఆ కుటుంబంలో మాత్రం ఏదో ఒక ఆర్థిక సమస్య ఉంటుంది. అది చిన్నదైనా, పెద్దదైనా. కానీ ఆ కుటుంబానికి మాత్రం అది చిన్న సమస్య అయినా పెద్దగా కనిపిస్తుంది. ఎందుకంటే సమస్య వాళ్లది కాబట్టి. హ్హ హ్హ... నేను కుటుంబ బాధ్యత గురించి ఆలోచిస్తుంటే, నామీద నాకే ఆశ్చర్యమేస్తుంది. ఈ రోజు నాకు ఇంకొకటి అర్థమైంది. నిజాయితీగా సంపాదించేవాడికి కచ్చితంగా కుటుంబ బాధ్యత గుర్తుంటుంది. ప్రస్తుతం నా కుటుంబం ఉన్న పరిస్థితుల్లో నా నుంచి ఎటువంటి ఆర్థిక ఆసరా, అవసరం లేకున్నా, నాకు మాత్రం ఏదో చేయాలని ఉంది. రెండు రోజుల ముందు ‘నాన్నకు చొక్కా తీస్కోవాలి’ అని అమ్మ అన్నయ్యతో అన్నట్లు గుర్తు. అవును. తీస్కోవాలి. అమ్మా నాన్నలకు చెరో జత బట్టలు తీస్కోవాలని నా మనసు నిర్ణయించేసుకుంది. ఇప్పుడు వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తోంది. మనసుకు కాస్త గర్వంగా ఉంది. నేను దిగాల్సిన స్టాప్ కూడా వచ్చినట్లుంది. కానీ నా జేబులో పర్సే కనిపించట్లేదు. కంగారుగా అటూ ఇటూ చూశాను. బస్సు దిగిన ఒక వ్యక్తి నాకంటే కంగారుగా నడుస్తూ వెళ్లిపోతుండటం చూశాను. ఆ వ్యక్తి నా పర్స్ తీశాడో లేదోనన్న అనుమానంతో వెళ్తున్న బస్‌ను ఆపాలో లేదో అర్థం కాలేదు. కానీ డబ్బు పర్స్‌తో పాటు పోయిందని మాత్రం అర్థమైంది. నా మొట్టమొదటి జీతంతో అమ్మా నాన్నలకిచ్చే చిన్న ఆనందాన్ని కోల్పోయిన నా దురదృష్టానికి బాధేస్తోంది. నాకు దొరికిన డబ్బులను పోగొట్టుకున్న వారి బాధ ఇప్పుడు తెలుస్తోంది. ఎంతైనా ఉన్నదాని విలువ పోయినప్పుడేగా తెలిసేది. పోయిన నా డబ్బు విలువ నా కంటే బాగా ఇంకెవరికీ తెలీదు. కానీ నా దుఃఖం మాత్రం పెరుగుతూ... ఉంది. బస్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వల్ల అనుకుంటా, నేను కూడా సడన్‌గా నిద్ర నుండి లేచాను. నేను దిగాల్సిన స్టాప్ వచ్చింది. నాకు తెలీకుండానే నా చేయి ఆవేశంతో జేబు దగ్గరికి చేరింది. పర్స్ ఉందని నా మెదడుకు సమాచారం అందగానే ఆనందం నా మొహం మీదకి చేరింది. ఆనందం అద్భుతమైంది. ముఖ్యంగా దుఃఖం తర్వాత వచ్చే ఆనందం వెలకట్టలేనిది. అనుభవించేవాడు తప్ప ఎవ్వరూ వెలకట్టలేరు. బస్సు దిగిన నేను ఎదురుగా కనిపించిన షాపింగ్ మాల్‌లోకి నడక ప్రారంభించాను, నా చిన్న ఆనందాన్ని తీర్చుకోవడానికి! దుఃఖం తర్వాత వచ్చే ఆనందం వెలకట్టలేనిది. అనుభవించేవాడు తప్ప ఎవ్వరూ వెలకట్టలేరు. - శ్రీనాథ్ జెల్లా