యూట్యూబ్‌ను​ షేక్ చేసిన ​'సలార్'​ ట్రైలర్.. రికార్డ్స్‌ అన్నీ బద్దలు | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌ను​ షేక్ చేసిన ​'సలార్'​ ట్రైలర్.. రికార్డ్స్‌ అన్నీ బద్దలు

Published Sun, Dec 3 2023 7:19 AM

Salaar Trailer Break All Records - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌  తెరకెక్కిస్తున్న చిత్రం 'సలార్‌: సీజ్‌ఫైర్‌'. ఈ సినిమా ప్రకటన వచ్చిన రోజు నుంచి అన్నీ సంచలనాలే అని చెప్పవచ్చు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తోనే ఇండియన్‌ రికార్డ్స్‌ బద్దలు చేశాడు డార్లింగ్‌.. ఈ సినిమా ట్రైలర్​తో 24 గంటల పాటు యూట్యూబ్​ను షేక్ చేశాడు ప్రభాస్‌.  తెలుగు నుంచి హిందీ వరకు రికార్డుల ఊచకోతకు దిగాడు సలార్‌.. 24 గంటల్లో ఏయే భాషల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయో మీరూ తెలుసుకోండి.

తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ అన్ని భాషలు కలిపి కేవలం 24 గంటల్లోనే ఏకంగా 116+ మిలియన్​ల వ్యూస్ సాధించి ఇండియన్‌ సినిమా హిస్టరీలో రికార్డు కొట్టింది. దీంతో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన భారతీయ సినిమాగా సలార్‌ నిలిచింది. తెలుగులో కూడా సలారే ముందున్నాడు. ఇప్పటి వరకు తెలుగులో ‘సర్కారు వారి పాట’ సినిమా ట్రైలర్‌కు 24 గంటల్లో 26.77 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఈ రికార్డును డైనోసార్‌ దాటేశాడు.

సలార్‌ తెలుగు ట్రైలర్‌ వ్యూస్‌ 24 గంటల్లో   33 మిలియన్ల వ్యూస్ సాధించి.. చరిత్ర సృష్టించింది. ఇక హిందీలో 54.3 మిలియన్​ మార్క్ దాటేసింది. ఈ క్రమంలో బాలీవుడ్లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్​గా 'సలార్' రికార్డు క్రియేట్ చేసింది. ఇదివరకు ఆదిపురుష్ (52.3 మిలియన్) టాప్​లో ఉంది. కాగా, ప్రస్తుతం సలార్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇలా అన్నీ భాషల్లో సలార్‌ ట్రైలర్‌ దుమ్ములేపింది. డిసెంబర్‌ 22న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యూఎస్‌లో 1979కి పైగా ప్రాంతాల్లో ఈ సినిమా విడుదల కానుంది. అమెరికాలో ఇన్ని లొకేషన్లలో రిలీజ్‌కానున్న తొలి భారతీయ చిత్రంగా ‘సలార్‌’ నిలవనుంది. 

తెలుగులో - 32.6 మిలియన్ వ్యూస్, 1.24 M లైక్స్
హిందీలో - 54.3 మిలియన్ వ్యూస్, 850k లైక్స్
తమిళంలో - 9.1 మిలియన్ వ్యూస్, 226k లైక్స్
 

కన్నడలో - 9.6 మిలియన్ వ్యూస్, 215k లైక్స్
మలయాళంలో - 7.7 మిలియన్ వ్యూస్, 212k లైక్స్
అన్నీ భాషలు కలిపి- 116+ మిలియన్‌ వ్యూస్‌, 2.7+ M లైక్స్‌

Advertisement
 
Advertisement