సలార్‌ టికెట్ల ధరలు పెరిగే ఛాన్స్‌.. ఈ దెబ్బకు RRR సినిమా రికార్డ్‌ బద్దలే

Salaar Movie Tickets Price Hike In Nizam Areas - Sakshi

ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం సలార్‌.. డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటకే విడుదలైన సలార్‌ టీజర్‌, ట్రైలర్‌లోనూ ప్రభాస్‌ ఎలివేషన్స్‌ ఆకట్టుకోవడంతో ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. సలార్‌ రన్‌టైమ్‌ 2గంటల 55నిమిషాలు ఉన్న ఈ మూవీ టికెట్‌ రేట్లు పెరగనున్నట్లు తెలుస్తోంది.  సలార్‌ చిత్రానికి సంబంధించి తెలంగాణ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

దీంతో టికెట్‌ రేట్లు పెంచుకునేందుకే కాకుండా అదనపు షోస్‌ అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని మైత్రి మేకర్స్‌ రిక్వెస్ట్ చేసిందట.. అంతే కాకుండా సలార్‌ విడుదల రోజున సింగిల్‌ థియేటర్‌లో 6 షోస్‌లు ప్రదర్శించాలని ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం ఉన్న టికెట్‌ రేట్లకు మరో రూ. 100 పెంచుకునేందుకు అనుమతి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సింగిల్ స్క్రీన్​లోనే ఒక టికెట్‌ ధర సుమారు రూ. 300 వరకు ఉండే ఛాన్స్‌ ఉంది. అదే మల్టీప్లెక్స్​ల్లో అయితే రూ. 400 పైగానే ఉండనుంది.

సలార్‌ విడుదల రోజున అంటే (డిసెంబర్‌ 22న) కొన్ని థియేటర్‌లలో అర్ధరాత్రి ఒంటిగంటకే (1:00 AM) మొదటి షో పడనుంది. మిగిలిన అన్ని థియేటర్‌లలో ఉదయం 4 గంటలకు మొదటి షో ప్రారంభం కానుంది. డిసెంబర్‌ 15న సలార్‌ టికెట్ల అమ్మకాలు ప్రారంభం అవుతాయని గతంలోనే ఆ చిత్ర మేకర్స్‌ ప్రకటించారు. కానీ తెలంగాణలోని నైజాం రైట్స్‌ కొనుగోలు చేసిన మైత్రి మేకర్స్‌ అభ్యర్థనపై ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటనను బట్టి ఆన్‌లైన్‌లో టికెట్ల ఓపెన్‌ అవుతాయని సమాచారం.

ప్రభుత్వం నుంచి సలార్‌కు అనుకూలంగా ప్రకటన వస్తే RRR సినిమా మొదటి రోజు కలెక్షన్స్‌ రికార్డును బీట్‌ చేయడం దాదాపు ఖాయం అని చెప్పవచ్చు. RRR సినిమాకు మొదటిరోజు రూ. 240 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఓవర్సీస్‌లలో ఇప్పటికే సలార్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌  స్టార్ట్‌ అయ్యాయి. అమెరికా, యూకే వంటి నగరాల్లో సలార్‌ దూసుకుపోతుంది. ఇప్పటికే అక్కడ దాదాపు 25 వేలకు పైగానే టికెట్లు అమ్ముడబోయాయి. దీంతో సినిమా విడుదలకు ముందే సుమారు రూ. 9 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top