సాక్షి అగర్వాల్ కొత్త మూవీ .. సరికొత్త కాన్సెప్ట్‌తో! | Sakshi
Sakshi News home page

సాక్షి అగర్వాల్ 'సారా' మూవీ.. షూటింగ్ ప్రారంభించిన ఇళయరాజా!

Published Wed, Sep 20 2023 2:22 PM

Sakshi Agarwal Latest Movie Sara Shooting Starts in Chennai

సాక్షి అగర్వాల్  రాజా రాణి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ సాక్షి అగర్వాల్. ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. తాజాగా సాక్షి అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సారా. ఈ మూవీ షూటింగ్‌ వినాయక చవితి సందర్భంగా చైన్నెలోని ఇళయరాజా రికార్డింగ్‌ స్టూడియోలో ప్రారంభించారు.  విజయ్‌ విశ్వ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, రోబో శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌.విజయలక్ష్మి, చెల్లమ్మాళ్‌ గురుస్వామి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజిత్‌ కన్నా దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు సంగీత దర్శకుడు ఇళయరాజా ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.

(ఇది చదవండి: చంద్రబాబు అరెస్ట్‌.. స్టార్‌ హీరో సంబరాలు!)

తనకి అవకాశాన్ని కల్పించిన దర్శకుడికి సాక్షి అగర్వాల్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం సరికొత్త అనుభవాన్నిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్తీక్‌రాజా సంగీత దర్శకత్వంలో నటించడం గర్వంగా ఉందని నటుడు విజయ్‌ విశ్వ పేర్కొన్నారు. చిత్ర దర్శకకుడు వివరాలను తెలుపుతూ క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక యువతి తన కోసం అన్ని వదులుకొని వచ్చిన ప్రేమికుడిని కాపాడుతుందా? లేక తన కోసం త్యాగం చేసిన స్నేహితుడిని కాపాడుతుందా? అన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రమని తెలిపారు. హీరోయిన్‌ ఇతివృత్తంతో యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా మంచి అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
 
Advertisement