పిరియడ్స్‌లోనూ ‘హాఫ్ ఐరన్‌మ్యాన్’.. రికార్డు సృష్టించిన నటి | Saiyami Kher Finishes Grueling Half Ironman Triathlon While On Her Period | Sakshi
Sakshi News home page

పిరియడ్స్‌లోనూ 70. 3 మైళ్లు.. రికార్డు సృష్టించిన టాలీవుడ్‌ హీరోయిన్‌!

Jul 12 2025 12:23 PM | Updated on Jul 12 2025 2:27 PM

Saiyami Kher Finishes Grueling Half Ironman Triathlon While On Her Period

కొంతమంది తారలు నటనతో ఆకట్టకుంటూనే అప్పుడప్పుడు తమలోని అసాధరణమైన నైపుణ్యాన్ని బయటిప్రపంచానికి చూపించి.. ఆశ్చర్యపరుస్తుంటారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా..ఇతర రంగాలలోనూ తన టాలెంట్‌ని నిరూపించుకొని ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సయామీ ఖేర్(Saiyami Kher )ఒకరు. తనదైన నటనతో అటు బాలీవుడ్‌, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బ్యూటీ.. క్రీడల్లోనూ రాణిస్తోంది. ఇటీవలఐరన్‌మ్యాన్‌ 70.3’ అనే ట్రయాథ్లాన్‌ను పూర్తిచేసి..ఒకే ఏడాదిలో రెండు సార్లు రేసుని పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించింది. అయితే సారి ఆమె పిరియడ్స్లో ఉన్నప్పుడు ఘనత సాధించడం గమనార్హం.

ఏమిటీ ‘ఐరన్మ్యాన్‌70.3’ 
ఐరన్‌మ్యాన్‌ 70.3’ అనేది ఒక ప్రముఖ ట్రయాథ్లాన్ రేసు, ఇది ఐరన్‌మ్యాన్ సిరీస్‌లో భాగం. దీనిని "హాఫ్ ఐరన్‌మ్యాన్" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పూర్తి ఐరన్‌మ్యాన్ రేస్ దూరంలో సగం ఉంటుంది. ఈ రేస్ మూడు ఈవెంట్‌లను కలిగి ఉంటుంది. తొలుత 1.9 కిలోమీటర్లు (1.2 మైళ్లు) ఈత కొట్టాలి. తర్వాత 90 కిలో మీటర్లు(56 మైళ్లు) సైక్లింగ్చేయాలి. తర్వాత 21.1(13.1 మైళ్లు) కిలోమీటర్లు పరుగెత్తాలి. మొత్తం దూరం 113 కిలోమీటర్లు(70.3 మైళ్లు). అందుకే దీన్నీ ఐరన్మ్యాన్‌ 70.3 అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో నిర్వహించబడుతుంది. జులై 6 స్వీడన్లోని జోంకోపింగ్లో నిర్వహించిన రేస్లో సయామీ ఖేర్పాల్గొని పతాకాన్ని సాధించిది. గతేడాది సెప్టెంబర్‌లో తొలిసారిగా మెడల్‌ అందుకున్న సయామీ.. ఇప్పుడు స్వీడన్‌లో నిర్వహించిన రేస్‌లో సత్తా చాటి మరో పతకం అందుకుంది.

నెలసరి సమస్యను అధిగమించి.. 
నాకు పీసీఓఎస్‌(పాలిసిస్టిక్ఓవరీ సిండ్రోమ్‌) ఉంది. దీని వల్ల రుతుక్రమం సరిగ్గా కాదు. రేసులో పాల్గొనే వారంలోనే నాకు పిరియడ్స్మొదలయ్యాయి. అదృష్టవశాత్తు నా పీరియడ్స్చివరి రోజు రేసులో పాల్గొన్న కాబట్టి నొప్పి అంతగా లేదు. కానీ సాధారణ రోజుల కంటే సమయంలోనే నాకు కాస్త అసౌకర్యంగానే అనిపించింది. మానసికంగా కొంత కలవరపెట్టింది. చాలా మంది మహిళలు పీరియడ్స్ఉన్నప్పుడు కూడా ఉద్యోగానికి, ఇతర పనులకు హాజరవుతుంటారు. అసౌకర్యంలోనూ మనం ఎలా ముందుకు సాగాలో వారి నుంచి నేర్చుకోవచ్చు. నేను కూడా నెలసరి సమస్యను అధిగమించి గత పోటీ కంటే సారి 32 నిమిషాల ముందే రేసుని పూర్తి చేశానుఅని సయామీ నేషనల్మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

సయామీ సీనీ నేపథ్యం
నాసిక్కి చెందిన సయామీ.. ‘రేయ్‌’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. తర్వాత బాలీవుడ్కి వెళ్లి.. అక్కడ వరుస సినిమాలతో స్టార్హీరోయిన్గా గుర్తింపు పొందింది. చాలా కాలం తర్వాతవైల్డ్డాగ్‌‌’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘జాబ్‌’లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం హిందీ, మరాఠీ చిత్రాలతో బీజీగా అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement