సైతాన్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ | Saithan Web Series First Episode Preview For Media | Sakshi
Sakshi News home page

Saithan Web Series: సైతాన్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌

Jun 14 2023 8:15 PM | Updated on Jun 14 2023 8:19 PM

Saithan Web Series First Episode Preview For Media - Sakshi

ఒక తెలుగు వెబ్ సిరీస్‌లో క్రైమ్ సన్నివేశాలని ఈ తరహాలో భయకంరంగా చూపించడం ఇదే తొలిసారి అని, ఆ సీన్స్ వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటాయన్నాడు. ఈ

దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న క్రైమ్ వెబ్ సిరీస్ 'సైతాన్'. కొన్ని రోజుల క్రితం సైతాన్ ట్రైలర్ రిలీజ్‌ చేయగా మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతోంది. ట్రైలర్‌లో చూపిన ఒళ్ళు గగుర్పొడిచే క్రైమ్ అంశాలు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అయితే ట్రైలర్‌లో ఉన్న కొన్ని ఘాటైన అభ్యంతకర పదాలు, డైలాగ్స్‌పై చర్చ జరగడంతో సోషల్‌ మీడియాలో సైతాన్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.

తాజాగా సైతాన్ సిరీస్‌లోని ఒక ఎపిసోడ్‌తో పాటు షో రీల్‌ను మీడియాకు ప్రదర్శించారు. ఈ ఎపిసోడ్‌ వీక్షించిన మీడియా వారితో పాటు తదితరులు సిరీస్ కంటెంట్‌ను, టేకింగ్‌ను మెచ్చుకున్నారు. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌లో కథా పాత్రలను రూపొందించామన్నాడు మహి వి రాఘవ్‌. ఆర్టిస్టులు రిషి, సెల్లి, జాఫర్, దేవయాని అలాగే ఇతర నటీనటులు అందరూ బాగా చేశారని ప్రశంసించాడు.

ఒక తెలుగు వెబ్ సిరీస్‌లో క్రైమ్ సన్నివేశాలని ఈ తరహాలో భయకంరంగా చూపించడం ఇదే తొలిసారి అని, ఆ సీన్స్ వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటాయన్నాడు. ఈ వెబ్ సిరీస్ లో ఉండే వయలెన్స్.. బోల్డ్ కంటెంట్ డిస్టర్బ్ చేసే విధంగా ఉంటాయని కాబట్టి ఈ వెబ్ సిరీస్‌ను చూసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దర్శకుడు తెలిపాడు.

చదవండి: మొన్ననే విడాకులు, అంతలోనే కలవాలని ఉందంటున్న నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement