'కరీనాతో డేటింగ్‌.. ఆ హీరోయిన్‌ అలా చేయమని సలహా ఇచ్చింది' | Sakshi
Sakshi News home page

Saif Ali Khan: విడాకుల తర్వాత కరీనాతో డేటింగ్‌.. ఆ హీరోయిన్‌ ఇచ్చిన సలహా..

Published Wed, Jan 24 2024 10:51 AM

Saif Ali Khan Reveals Rani Mukerji Advice on Dating Kareena Kapoor - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ జంట సైఫ్‌ అలీ ఖాన్‌- కరీనా కపూర్‌ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే సైఫ్‌ ఇద్దరు పిల్లల తండ్రి అయినప్పటికీ అతడిని మనసారా ప్రేమించింది కరీనా. 2004లో మొదటి భార్య అమృత సింగ్‌కు విడాకులిచ్చాడు సైఫ్‌. ఆ మరుసటి ఏడాది కరీనా కపూర్‌తో తొలిసారి ఫోటోషూట్‌లో పాల్గొన్నాడు. అప్పటినుంచి వీరి మధ్య చనువు పెరిగింది. ఎల్‌ఓసీ: కార్గిల్‌, ఓంకార, తషాన్‌, కుర్బాన్‌, ఏజెంట్‌ వినోద్‌.. తదితర చిత్రాల్లో వీరు జంటగా నటించడగా ఆ సమయంలో వీరి మధ్య స్నేహం ప్రేమగా మారి అది మరింత బలపడుతూ వచ్చింది. అలా వీరు 2012లో పెళ్లి చేసుకోగా తైమూర్‌, జెహంగీర్‌ అని ఇద్దరు కుమారులు జన్మించారు.

షూటింగ్‌లో నాకో సలహా ఇచ్చింది
అయితే కరీనాతో డేటింగ్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్‌ హీరోయిన్‌ రాణీ ముఖర్జీ తనకో సలహా ఇచ్చిందట. అది తనకెంతో ఉపయోగపడిందంటున్నాడు హీరో. ఆ సలహా గురించి, దాన్ని సూచించిన వ్యక్తి గురించి సైఫ్‌ మాట్లాడుతూ.. 'రాణి చాలా అద్భుతమైన వ్యక్తి. సినిమాలు చేసేకొద్దీ మా మధ్య స్నేహబంధం మరింత పటిష్టంగా మారింది. ఓసారి రాణి షూటింగ్‌లో నాకో సలహా ఇచ్చింది. నువ్వు కరీనాను ప్రేమిస్తున్నావు.. అందుకు సంతోషం.. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపట్టుకో.. మీ ఇంట్లో ఇద్దరు హీరోలు ఉంటారన్నది ఎన్నటికీ మర్చిపోకు అని చెప్పింది.

ఇంట్లో సమానత్వం
తన మాటలు ఇప్పటికీ నా మెదడులో తిరుగుతూనే ఉన్నాయి. ఇంతకీ తను చెప్పిన వాక్యానికి అర్థమేంటంటే.. ఇంటి కోసం ఇద్దరూ కష్టపడుతారు. ఒకరు పని చేసినప్పుడు మరొకరు పిల్లల బాధ్యతను చూసుకోవాలి అని! నువ్వు ఆడ, నేను మగ అన్న అహంకారం లేకుండా ఇద్దరూ అన్నిరకాల పనులు చేసుకోవాలని సలహా ఇచ్చింది. భార్య ఉద్యోగానికి వెళ్తే అప్పుడు భర్త ఇంటిని చూసుకోవాలని.. లింగబేధాలు లేకుండా సమానత్వం ఉండాలన్నదే ఆమె భావన. దాన్ని నేను ఇప్పటికీ ఆచరిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణలో ఇటీవలే సైఫ్‌కు గాయమవగా సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడిప్పుడే ఆ గాయం నుంచి కోలుకుంటున్నాడు.

చదవండి: గతేడాది థియేటర్లలో రిలీజ్.. ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్

whatsapp channel

Advertisement
 
Advertisement