Actress Sai Pallavi Farming Work Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Sai Pallavi : కూలీగా మారిన స్టార్‌ హీరోయిన్‌.. ఫోటో వైరల్‌

Apr 3 2022 3:34 PM | Updated on Apr 3 2022 4:06 PM

Sai Pallavi Turns A Farmer, Pic Goes Viral - Sakshi

కూలీగా మారి వ్యవసాయ పనులు చేసింది.  ఆడవాళ్లు అంతా  పొలం పనుల్లో ఉండగా అదే తరహాలో రెడీ అయి, వారితో కలిసి పంట కోత పనుల్లో పాల్గొంది.

నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి ఎంత సింపుల్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. స్టార్‌ హీరోయిన్‌ అయినప్పటికీ.. సాదా సీదా యువతిలాగే వ్యవహరిస్తుంది. ఆమే స్నేహితుల జాబితాలో కూడా ఎక్కువగా మధ్యతరగతికి చెందిన వారే ఉంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండాలనే తత్వం సాయి పల్లవిది. అందుకే ఆమెలో స్టార్‌ హీరోయిన్‌ అనే గర్వం కొంచెం కూడా కనిపించదు. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫోటోనే అందుకు నిదర్శనం.

ఉగాది పర్వదినాన్ని సినీ ప్రముఖులు అంతా అంగరంగ వైభవంగా జరుపుకుంటే.. సాయి పల్లవి మాత్రం మట్టి మనుషులతో కలిసి పొలం దగ్గర ఉగాది వేడుకలు జరుపుకుంది. అంతేకాదు కూలీగా మారి వ్యవసాయ పనులు చేసింది.  ఆడవాళ్లు అంతా  పొలం పనుల్లో ఉండగా అదే తరహాలో సాయిపల్లవి కూడా రెడీ అయి, వారితో కలిసి పంట కోత పనుల్లో పాల్గొంది. ఈ ఫొటోలను సాయిపల్లవి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ ఫోటో చూసిన అభిమానులు సాయి పల్లవిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నీకంటే అందంగా ఎవరూ ఉండరంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

ఇక సాయి పల్లవి సినిమా విషయాలకొస్తే.. ఇటీవల ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అలాగే ఆమె రానాతో కలిసి నటించిన ‘విరాటపర్వం’చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం షూటింగ్స్‌కి కాస్త విరామం ఇచ్చి.. పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement