అల్లు అర్జున్‌ చెల్లిగా సాయి పల్లవి! | Sai Pallavi To Play Allu Arjun Sister In Pushpa Movie? | Sakshi
Sakshi News home page

‘ఆచార్య’కి నో.. అల్లు అర్జున్‌ చెల్లిగా ఓకే

Jan 5 2021 1:15 PM | Updated on Jan 5 2021 7:26 PM

Sai Pallavi To Play Allu Arjun Sister In Pushpa Movie? - Sakshi

ప్రస్తుతం సాయి పల్లవి కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉంది. ఇలాంటి సమయంలో ఒక యంగ్‌ మీరోకి చెల్లిగా నటించడానికి సాయి పల్లవి ఒప్పకుందంటే కాస్త సందేహించాల్సిందే.

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌‌ కాంబినేషన్‌లో ‘ఆర్య, ఆర్య 2’ తర్వాత వస్తున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మికా మందన్నా కథానాయిక.  పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై సుక్కు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అల్లు అర్జున్‌ తొలిసారి పూర్తిస్థాయి మాస్‌ రోల్‌లో మెప్పించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు కాస్త కుదుట పడటంతో ఈ నెల 8నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సారి పక్కా షెడ్యూల్ రెడీ చేసి త్వరగా సినిమాను పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తుందట.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఈ సినిమాలో ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి నటించనుందని ఆ వార్త సారాంశం. అంతేకాదు ఇందులో సాయిపల్లవి బన్నీకి చెల్లెలిగా నటించనుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమా కోసమే  చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో నటించే అవకాశం వచ్చినా తిరస్కరించిదట ఈ నాచ్యురల్ బ్యూటీ. ప్రస్తుతం సాయి పల్లవి కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉంది. ఇలాంటి సమయంలో ఒక యంగ్‌ హీరోకి చెల్లిగా నటించడానికి సాయి పల్లవి ఒప్పకుందంటే కాస్త సందేహించాల్సిందే. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాలి. ప్రస్తుతం ఈ నాచ్యురల్‌ బ్యూటీ  రానా సరసన 'విరాటపర్వం 1992' మూవీలో నటిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement