Sai Dharam Tej Speech At Virupaksha Movie Success Meet - Sakshi
Sakshi News home page

Sai Dharam Tej: ప్రేక్షకులు విసిరిన ఛాలెంజ్‌కు సమాధానమే విరూపాక్ష

Apr 24 2023 7:56 AM | Updated on Apr 24 2023 11:07 AM

Sai Dharam Tej Speech at Virupaksha Movie Success Meet - Sakshi

విరూపాక్ష’ విజయం నాదో, మా టీమ్‌దో కాదు.. మన ప్రేక్షకులది. మన ఇండస్ట్రీకి ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ఇచ్చింది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తీసుకెళ్లటానికి ప్లాన్‌ చేస్తున్నాం’’

‘‘గత ఏడాది కొన్ని సినిమాలకు ప్రేక్షకులు సరిగ్గా రాలేదు. మమ్మల్ని థియేటర్స్‌కు రప్పించే సినిమాలు తీస్తేనే వస్తామంటూ ఆడియన్స్‌ ఓ చాలెంజ్‌ విసిరారు. ఆ సవాల్‌కి జవాబే ‘విరూపాక్ష’’ అని హీరో సాయిధరమ్‌ తేజ్‌ అన్నారు. కార్తీక్‌ దండు దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్, సంయుక్తా మీనన్‌ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. బాపినీడు బి.సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. డైరెక్టర్‌ సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే అందించిన ఈ సినిమా గత శుక్రవారం (ఏప్రిల్‌ 21) విడుదలైంది.

ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. ‘‘విరూపాక్ష’ విజయం నాదో, మా టీమ్‌దో కాదు.. మన ప్రేక్షకులది. మన ఇండస్ట్రీకి ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ఇచ్చింది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తీసుకెళ్లటానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘విరూపాక్ష’ని హిట్‌ చేసిన ఆడియన్స్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు కార్తీక్‌ దండు. ‘‘ఈ మూవీలో నా పాత్రకి వస్తున్న స్పందనకు కారణం కార్తీక్‌గారే’’ అన్నారు సంయుక్తా మీనన్‌. ‘‘ఈ సినిమాని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు డైరెక్టర్‌ మారుతి. ‘‘విరూపాక్ష’ని అందరూ థియేటర్‌లోనే చూడండి.. గొప్ప అనుభూతి వస్తుంది’’ అన్నారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని. ఈ కార్యక్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ లోక్‌నాథ్, కెమెరామేన్‌ శ్యామ్‌ దత్, నటీనటులు సోనియా సింగ్, సాయిచంద్, అజయ్, కమల్‌ కామరాజు బ్రహ్మాజీ, రవికృష్ణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement