'సగిలేటి కథ' సినిమాలోని 'చికెన్ సాంగ్' లాంచ్

Sagileti Katha Movie Chicken Song Video - Sakshi

రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ'. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకుడు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్‌టైన్మెంట్, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అలరిస్తుంది. తాజాగా ఓ క్రేజీ గీతాన్ని విడుదల చేశారు.

(ఇదీ చదవండి: సర్జరీ వికటించి ప్రముఖ నటి కన్నుమూత)

హీరో నవదీప్ ఆధ్వర్యంలో తెలుగు యంగ్ డైరెక్టర్స్ 'బేబీ' ఫేమ్ సాయి రాజేశ్, వెంకటేష్ మహా, సందీప్ రాజ్.. ఈ సాంగ్ లాంచ్‌కి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సినిమాలో రోషం రాజు క్యారెక్టర్ తనకు చాలా ఇష్టమని, అలానే ఈ మూవీలో కామెడీ అందరిని నవ్విస్తుందని, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతిఒక్కరికీ చికెన్ తినాలనిపిస్తుందని నవదీప్ చెప్పుకొచ్చాడు. అక్టోబర్ 13న ఈ చిత్రం థియేటర్లలోకి వస్తోంది.

(ఇదీ చదవండి: 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top