RRR Movie Announced Two New Release Dates - Sakshi
Sakshi News home page

RRR Movie: గుడ్‌ న్యూస్‌.. ఎట్టి పరిస్థితుల్లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' రిలీజ్‌ అప్పుడే!

Jan 21 2022 6:46 PM | Updated on Jan 21 2022 7:36 PM

RRR Movie New Release Date Announced - Sakshi

దర్శక ధీరుడు జక్కన్న ప్రతిష్టాత్మకంగా చెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్ఆర్‌). వాస్తవానికి ఈ మూవీ ఈపాటికి విడుదలై అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగలేదు. అందుకు దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరగడం, థియేటర్‌ ఆక్యుపెన్సీ, పలు రాష్ట్రాల్లో స్వల్ప లాక్‌డౌన్‌ వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమాను పోస్ట్‌పోన్ చేసేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదల తేది ఏమై ఉంటుందన్న ఆసక్తి ప్రేక్షకులను ఇంకా వీడలేదు. ఎప్పుడూ రిలీజ్‌ చేస్తారా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 

(చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు అమెజాన్‌ భారీ ఆఫర్‌.. కానీ)

ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ప్రేక్షకులకు, అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనా కలకలం తొలగిపోయి అన్ని పరిస్థితులు అనుకూలించి పూర్తి ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభమైతే మార్చ్‌ 18న విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామని మేకర్స్‌ తెలిపారు. ఒకవేళ అలా జరగకుంటే ఎలాంటి పరిస్థితులున్నా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. దీంతో ఇన్నేళ్ల ప్రేక్షకుల నిరీక్షణకు తెరపడినట్లు ఉంది. ఈ ప‍్రకటనతో ఆర్‌ఆర్‌ఆర్‌ సుమారు 14 భాషల్లో విడుదలకానుంది. ఈ ఒక్క న్యూస్‌తో అభిమానులు పండుగ చేసుకోనున్నారు. 

(చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్‌' ట్రైలర్ స్పూఫ్‌.. అదరగొట్టేశారుగా..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement